Share News

Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన

ABN , Publish Date - Feb 14 , 2025 | 05:21 AM

జాతి వైషమ్యాలతో అల్లకల్లోలంగా మారిన మణిపూర్‌లో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. ఈ విషయాన్ని గురువారం కేంద్ర హోంశాఖ ప్రకటించింది.

Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన

  • హోంశాఖ ప్రకటన.. రాష్ట్రంలో తొలగని రాజకీయ అనిశ్చితి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: జాతి వైషమ్యాలతో అల్లకల్లోలంగా మారిన మణిపూర్‌లో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. ఈ విషయాన్ని గురువారం కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ముఖ్యమంత్రిగా బిరేన్‌సింగ్‌ రాజీనామా చేసిన కొద్ది రోజులకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకొంది. ‘‘మణిపూర్‌ గవర్నర్‌ సమర్పించిన నివేదిక, ఇతర సమాచారాన్ని పరిశీలించాక రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో పాలన సాగడంలేదని గ్రహించాను. అందువల్ల రాజ్యాంగంలోని 356వ అధికరణం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలను స్వీకరించాను’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నట్టుగా హోం శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Updated Date - Feb 14 , 2025 | 05:21 AM