ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chhattisgarh: హోరాహోరీ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్ హతం

ABN, Publish Date - Jan 12 , 2025 | 04:39 PM

ఇరువైపుల నుంచి కాల్పులు నిలిచిపోగానే ఘటనా ప్రాంతం వద్ద యూనిఫాంతో ఉన్న ముగ్గురు నక్సల్ మృతదేహాలు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్ధాలను కూడా ఘటనా స్థలి నుంచి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.

రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ (Bijapur) జిల్లాలో ఆదివారం ఉదయం ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ముగ్గురు నక్సల్స్‌ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. భద్రతా బలగాలు నక్సల్స్ ఏరివేత ఆపరేషన్‌లో ఉండగా ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్టు బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందరాజ్ పి తెలిపారు. జిల్లా రిజర్వ్ గార్డులు (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), జిల్లా బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్టు చెప్పారు.

Delhi Elections 2025: నిరుద్యోగ యువతకు రూ.8,500


ఇరువైపుల నుంచి కాల్పులు నిలిచిపోగానే ఘటనా ప్రాంతం వద్ద యూనిఫాంతో ఉన్న ముగ్గురు నక్సల్ మృతదేహాలు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్ధాలను కూడా ఘటనా స్థలి నుంచి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు వివరించారు.


ఈ ఏడాది ఇంతవరకూ 12 మంది నక్సల్స్ హతం

కాగా, ఈ ఏడాది ఇంతవరకూ 12 మంది నక్సల్స్‌ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జనవరి 6న నారాయణపూర్, దంతేవాడ, బిజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో ఐదుగురు నక్సల్స్‌, జనవరి 9న సుక్మా జిల్లాలో ముగ్గురు నక్సల్స్‌ హతమయ్యారు. జనవరి 3న రాయపూర్ డివిజన్‌లోని గరియబండ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక నక్సలైట్‌ హతమయ్యాడు. గత ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో 219 మంది నక్సల్స్‌ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.


ఇవి కూడా చదవండి..

Hero Vijay: హీరో విజయ్ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

Chief Minister: నాన్న అనే ఆ పిలుపే మా పాలనకు కితాబు

Read Latest National News and Telugu News

Updated Date - Jan 12 , 2025 | 04:39 PM