Share News

PM Modi: వక్ఫ్ నిబంధనలను స్వార్థం కోసం కాంగ్రెస్ మార్చేసింది: మోదీ

ABN , Publish Date - Apr 14 , 2025 | 03:05 PM

ముస్లింలపై అంత ప్రేముంటే పార్టీ అధ్యక్షుడి పదవి ముస్లింలకు ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీని మోదీ ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతం టిక్కెట్లు వారికే ఇచ్చి, వారు గెలిచి ఉంటే తమ అభిప్రాయాలను వారు వ్యక్తం చేసి ఉండేవారు కాదా అని నిలదీశారు.

PM Modi: వక్ఫ్ నిబంధనలను స్వార్థం కోసం కాంగ్రెస్ మార్చేసింది: మోదీ

హిసార్: వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ వైఖరిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) దుయ్యబట్టారు. ముస్లిం ఛాందసవాదులను బుజ్జగించడం మాత్రమే కాంగ్రెస్‌కు తెలుసునని, కొత్త చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ స్వప్రయోజనాల కోసం వక్ఫ్ చట్టంలోని రూల్స్‌ను మార్చేసిందని ఆరోపించారు. ముస్లింలపై అంత ప్రేముంటే పార్టీ అధ్యక్షుడి పదవి ముస్లింలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతం టిక్కెట్లు వారికే ఇచ్చి, వారు గెలిచి ఉంటే తమ అభిప్రాయాలను వారు వ్యక్తం చేసి ఉండేవారు కాదా అని నిలదీశారు. ఎవరికీ మంచి చేయరాదన్నదే కాంగ్రెస్ ఉద్దేశమని అన్నారు.

PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..


వక్ఫ్‌ ప్రాపర్టీగా లక్షలాది హెకార్టులు ఉన్నాయని మోదీ చెప్పారు. ''వక్ఫ్ ఆస్తులను నిజాయితీగా ఉపయోగిస్తే ముస్లిం యువత బతకుతెరువు కోసం సైకిల్ పంక్చర్లు వేసుకోవాల్సి అవసరం లేదు. ఈ ఆస్తుల వల్ల కొందరు ల్యాండ్ మాఫియా మాత్రమే లబ్ధి పొందుతున్నారు. ఈ మాఫియా దళితులు, వెనుకబడిన వర్గాలు, వితంతువుల భూములు లూటీ చేస్తున్నారు. వక్ఫ్ చట్టంలో మార్పుల తర్వాత పేదల భూముల లూటీలు ఆగిపోతాయి. కొత్త వక్ఫ్ చట్టంతో గిరిజనులకు చెందిన భూముల జోలికి వక్ఫ్ బోర్డు వెళ్లలేదు. పేద ముస్లింలు, పస్మాండ ముస్లింలు తమ హక్కులను పొందగలుతారు. ఇదే నిజమైన సామాజిక న్యాయం" అని మోదీ అన్నారు.


హర్యానాలోని హిస్సార్ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి సోమవారంనాడు ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధి జర్నీలో ఈ విమానశ్రయం ఒక మైలురాయి కానుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. డాక్టర్ బీఆర్ అబేండ్కర్ జయంత్యుత్సవాన్ని స్మరించుకుంటూ, అంబేడ్కర్ పాటించిన విధానాలే తమ ప్రభుత్వానికి స్ఫూర్తినిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు బాబాసాహెబ్ అంబేడ్కర్‌కు ఆశయాలకు అనుగుణంగా ఉంటున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం రాజ్యాంగాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటోందని విమర్శించారు. ఎమర్జెన్సీ సమయంలో అధికారం నిలబెట్టుకునేందుకు రాజ్యాంగానికి పాతర వేసిందని, రాజ్యాంగం సెక్యులర్ సివిల్ కోడ్ గురించి చెబితే కాంగ్రెస్ దానిని ఎప్పుడూ అమలు చేసిందే లేదని అన్నారు. ఈరోజు ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తున్నామని అన్నారు. దురదృష్టవశాత్తూ కాంగ్రెస్ దీనిని వ్యతిరేకిస్తోందన్నారు.


రిజర్వేషన్ ప్రయోజనాలను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చేరుతున్నాయా అనేది కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకున్నా పాపాన లేదని మోదీ విమర్శించారు. అంబేడ్కర్ జీవించి ఉండగా ఆయనను కాంగ్రెస్ పదేపదే అవమానించిందని చెప్పారు. రెండుసార్లు ఆయన ఓడిపోయేలే చేసిందని అన్నారు. అంబేద్కర్ మరణం తర్వాత కూడా ఆయన జ్ఞాపకాలు చెరిపేసే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. సమానత్వం కోసం బాబాసాహెబ్ పాటుపడితే, కాంగ్రెస్ ఓట్ బ్యాంకు వైరస్‌ను వ్యాప్తి చేసిందన్నారు. మతప్రాతిపదికన రిజర్వేషన్లకు అంబేద్కర్ వ్యతిరేకమని, కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలతో ముస్లింలకు కూడా నష్టమే జరుగుతోందన్నారు. కొంతమంది ఛాందసవాదులు సంతోషంగా ఉండేలా చేయడం వల్ల సమానంలోని తక్కిన వారంతా నిరక్షరాస్యులుగా, పేదలుగా మిగిలిపోతారని, వక్ఫ్ చట్టంపై కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానమే అందుకు అతిపెద్ద నిదర్శనమని విమర్శించారు.


ఇవి కూడా చదవండి..

India Laser Weapon: భారత్‌ అమ్ముల పొదిలో లేజర్‌ అస్త్రం

Supreme Court Review Petition Filed: గడువు వద్దు

Updated Date - Apr 14 , 2025 | 03:08 PM