Kharge: ' పుష్ఫ' సినిమా డైలాగ్ తో కౌంటరిచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే
ABN , Publish Date - Apr 03 , 2025 | 01:35 PM
బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన విమర్శలను తీవ్రస్థాయిలో ఖండించారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. 'పుష్ఫ' సినిమా డైలాగ్ తో స్టాంగ్ కౌంటరిచ్చారు.

రాజ్యసభలో ఇవాళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అందరి దృష్టిని ఆకర్షించారు. 'పుష్ఫ' సినిమా డైలాగ్‌తో అధికారపక్షానికి కౌంటరిచ్చారు. వక్ఫ్ భూమిని కబ్జా చేశారంటూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) చేసిన ఆరోపణలపై ఖర్గే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు వక్ఫ్ భూములు కాజేశారంటూ తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పాలన్నారు. పొలిటికల్ డ్రామాలకు బెదిరిపోనని చెబుతూ 'పుష్ప' సినిమాలోని తగ్గేదేలే అంటూ హూంకరించారు. ఇవాళ రాజ్యసభలో జీరో అవర్‌లో ఖర్గే ఈ విషయాన్ని లేవనెత్తారు. "నా జీవితం ఒక తెరిచిన పుస్తకం. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ప్రజా జీవితంలో తలెత్తుకొని నిలబడ్డా. అలాంటి నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈ ఆరోపణలను ఠాకూర్ నిరూపించగలరా.. ఒకవేళ అలా చేస్తే రాజీనామా చేస్తా. లేదంటే అతనికి పార్లమెంట్‌లో ఉండే అర్హత లేదు. రాజీనామా చేయాల్సిందే". అని ఖర్గే ఫైరయ్యారు.
బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ నిన్న తనపై అసత్య, నిరాధార ఆరోపణలు చేశారని, మా పార్టీ ఎంపీలు ప్రశ్నించడంతో ఆ వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకున్నారు ఖర్గే. అయితే, జరగాల్సిన నష్టం జరిగిందని.. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికల్లో ఠాకూర్ చేసిన ఆరోపణలే వైరల్ అవుతున్నాయని అన్నారు. అందుకే తాను ఇలా నిలబడి ఆరోపణలను ఖండించాల్సి వస్తోందన్నారు. ఠాకూర్ చేసిన వ్యాఖ్యలకు సభాపక్ష నేత క్షమాపణలు చెప్పాలని ఖర్గే డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
వక్ఫ్ చట్టం 1995 vs వక్ఫ్ సవరణ బిల్లు 2025
కులాంతర వివాహానికి సిద్ధమైందని.. సోదరినే చంపేశాడు