Delhi Assembly: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. 41 స్థానాలు ఖరారు చేయనున్న బీజేపీ..
ABN, Publish Date - Jan 10 , 2025 | 10:15 AM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మిగిలిన 41 స్థానాలకు బీజేపీ శుక్రవారం అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఇప్పటికే 29 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కమలదళం ఈరోజు ఉదయం 10.30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కోర్ ఢిల్లీ గ్రూప్ నేతలతో సమావేశమవుతారు. ఈ రోజు రాత్రి లేదా శనివారం ఉదయం ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశమున్నట్లు తెలియవచ్చింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) నేపథ్యంలో మిగిలిన 41 స్థానాలకు (41 Seats) బీజేపీ (BJP) శుక్రవారం అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఇప్పటికే 29 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కమలదళం ఈరోజు ఉదయం 10.30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Home Minister Amit Shah), బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda), కోర్ ఢిల్లీ గ్రూప్ నేతలతో సమావేశమవుతారు. ఈ భేటి జేపీ నడ్డా నివాసంలో జరగనుంది. సాయంత్రం 6.30 గంటలకు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నేతలంతా ఈ భేటీకి హాజరవుతారు. ఈ రోజు రాత్రి లేదా శనివారం ఉదయం ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశమున్నట్లు తెలియవచ్చింది.
ఈ వార్త కూడా చదవండి..: అప్పుడు ఇల్లే వైకుంఠం
కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు (Delhi Assembly Elections)-2025 షెడ్యూల్‌ను భారత ఎన్నికల కమిషన్ (Election commission of India) మంగళవారం (జనవరి 7వ తేదీ)నాడు ప్రకటించింది. 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఒకే విడతలో ఎన్నికలను నిర్వహించనున్నట్టు తెలిపింది. ఫలితాలు ఫిబ్రవరి 8న వెలువడుతాయని పేర్కొంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ ప్లీనరీ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆ వివరాలను వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. జనవరి 17వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. 18న నామినేషన్ల పరిశీలన ఉంటుంది, 20వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 8న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
ఢిల్లీలో 1.55 కోట్ల ఓటర్లు ఉన్నారని, వీరిలో 83.49 లక్షల పురుష ఓటర్లు, 71.74 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారని, ఐదోసారి ఓటింగ్‌లో పాల్గొంటున్న వారు 2.08 లక్షల మంది ఉన్నారని చెప్పారు. 25.89 లక్షల మంది యువ ఓటర్లు (20-29) ఉన్నట్టు తెలిపారు. ఢిల్లీలో13,033 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఎన్నికల్లో అవకతవకలకు తావులేదు
నిర్దిష్ట గ్రూపులను టార్గెట్ చేసుకుని ఓటర్ల జాబితాలో వారి పేర్లు తొలగించడం, కొందరి పేర్లు చేర్చడం జరిగిందని కొందరు (రాజకీయ పార్టీలు) చేస్తున్న దుష్ప్రచారాన్ని రాజీవ్ కుమార్ తోసిపుచ్చారు. ఈవీఎంల గురించి సమాధానం ఇచ్చిన తర్వాత కూడా కొందరు ఈవీఎంల అవకతవకలపై మాట్లాడుతున్నారని అన్నారు. ఈవీఎంలలో వైరస్, బగ్ కానీ, చెల్లని ఓట్లు కానీ ఉండవని, రిగ్గింగ్‌కు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇండియాలో 99 కోట్ల రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారని, ఓటింగ్, మహిళా పార్టిసిపేషన్‌లో ఎన్నికల సంఘం కొత్త రికార్డులు సృష్టించిందని, త్వరలో 100 కోట్ల రిజిస్టర్డ్ ఓటర్లతో సరికొత్త రికార్డు నమోదు కానుందని చెప్పారు. మహిళా ఓటర్ల సంఖ్య 48 కోట్లు దాటడం దేశంలో మహిళా సాధికారతను బలంగా చాటుతోందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైకుంఠ ఏకాదశి.. టీటీడీ కీలక నిర్ణయం
శ్రీ మహావిష్ణు రూపంలో భద్రాద్రి రామయ్య..
తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jan 10 , 2025 | 10:15 AM