Delhi Election Results 2025: నేటి ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఫస్ట్ ప్రకటించేది ఇక్కడే.. చివరగా..
ABN , Publish Date - Feb 08 , 2025 | 07:30 AM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల ఫలితాలు ఈరోజు ప్రకటించబడతాయి. ఈ నేపథ్యంలో అన్ని లెక్కింపు కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఫస్ట్, లాస్ట్ ఫలితాలు ఎక్కడ వస్తాయనేది ఇక్కడ తెలుసుకుందాం.

ఢిల్లీ ఎన్నికల అసెంబ్లీ ఫలితాలు (Delhi Election Results 2025) కాసేపట్లో తేలనున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. దీంతో 19 కౌంటింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రత ఏర్పాట్లను చేశారు. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) కార్యాలయం పూర్తి చేసింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఉదయం తొమ్మిది గంటల తర్వాత ఓట్ల లెక్కింపు తొలి ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది.
ఫస్ట్, లాస్ట్ ఫలితాలు..
అయితే ఢిల్లీ కాంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాలు ముందే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ స్థానంలో అత్యల్ప సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో దాదాపు 78 వేల ఓటర్లు ఉండగా, ఇక్కడ 59.36 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. కానీ వికాస్‌పురి అసెంబ్లీ నియోజకవర్గంలో ఫలితాలు ఆలస్యం అయ్యే ఛాన్సుంది. ఇక్కడ అత్యధికంగా 4.56 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. దీంతో ఈ ప్రాంతం ఫలితాలు ఆలస్యం అవుతాయని పలువురు చెబుతున్నారు. ఈసారి ఈ ఎన్నికల్లో 699 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
30 వేల మంది పోలీసుల మోహరింపు
ఫిబ్రవరి 5న జరిగిన ఈ ఎన్నికల పోలింగ్‌లో 13 వేలకు పైగా పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ జరిగింది. మొత్తం 60.54 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల ఫలితాలు సాయంత్రంలోపు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. అన్ని EVMలను 11 జిల్లాల్లో నిర్మించిన 70 స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచారు. వీటి భద్రత కోసం దాదాపు 30 వేల మంది పోలీసులను మోహరించారు. సీసీటీవీలతో పాటు, కౌంటింగ్ కేంద్రాలను సూపర్‌వైజర్లు, మైక్రో అబ్జర్వర్లు కూడా పర్యవేక్షించారు.
మొత్తం వీడియో షూట్..
స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలను బయటకు తీసుకురావడం నుంచి ఓట్ల లెక్కింపు వరకు మొత్తం ప్రక్రియను వీడియోగ్రాఫ్ చేస్తారు. లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయడానికి మొత్తం ఐదు వేల మంది ఉద్యోగులను నియమించారు. వీరిలో లెక్కింపు పర్యవేక్షకులు, లెక్కింపు సహాయకులు, సూక్ష్మ పరిశీలకులు, గణాంక సిబ్బందితోపాటు ఇతర సహాయక సిబ్బంది ఉన్నారు. ఇది కాకుండా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 VVPAT యంత్రాల స్లిప్‌లు లెక్కించబడతాయి. తద్వారా ఎలాంటి అవాంతరాలు లేకుండా అంచనా వేయవచ్చు.
ఇవి కూడా చదవండి:
Gold and Silver Rates Today: పైపైకి పసిడి, వెండి రేట్లు.. ఎంతకు చేరాయంటే..
8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News