AAP: ఆప్‌కు జాతీయ హోదా ఉంటుందా? ఊడుతుందా?
ABN, Publish Date - Feb 08 , 2025 | 08:39 PM
ఆప్ ప్రభుత్వ అవినీతిపై సిట్ ఏర్పాటు చేయడం తమ ప్రాధాన్యతా క్రమాల్లో ఒకటని బీజేపీ ఎన్నికల ముందు, ఫలితాల తర్వాత కూడా ప్రకటించడంతో ఆప్‌కు మునుముందు చిక్కులు తప్పేలా లేవు.

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి దెబ్బ తగిలింది. బీజేపీ క్లీన్‌స్వీప్ సాధించడంతో రెండో స్థానంలోకి ఆప్ జారిపోయింది. దీంతో ఆప్ కొత్త చిక్కులు ఎదుర్కోనుందా? అనే విశ్లేషణ మొదలైంది. ఆప్ ప్రభుత్వ అవినీతిపై సిట్ ఏర్పాటు చేయడం తమ ప్రాధాన్యతా క్రమాల్లో ఒకటని బీజేపీ ఎన్నికల ముందు, ఫలితాల తర్వాత కూడా ప్రకటించడంతో ఆప్‌కు మునుముందు చిక్కులు తప్పేలా లేవు. ఇదే సమయంలో ఢిల్లీలో ఓటమి ప్రభావం ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న జాతీయ హోదాపై ఎలాంటి ప్రభావం చూపనుందనే ప్రశ్న కూడా తెరపైకి వచ్చింది. నిజంగానే ఆప్ జాతీయ స్థాయి హోదాకు ప్రమాదం ముంచుకురానుందా? ఓసారి చూద్దాం.
Delhi Elections 2025: ఫలించని జైలు సెంటిమెంట్.. ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ..
ఆప్‌కు జాతీయ స్థాయి హోదా ఎలా వచ్చింది?
2022లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 5 సీట్లు గెలుచుకుని సుమారు 13 శాతం ఓట్ల షేర్ సాధించడంతో 2023లో ఆ పార్టీకి జాతీయ స్థాయి హోదాను ఎన్నికల కమిషన్ మంజూరు చేసింది. గుజరాత్‌తో పాటు, ఢిల్లీ, పంజాబ్, గోవాలోనూ రాష్ట్ర పార్టీగా ఆప్ గుర్తింపు సాధించింది. ప్రస్తుతం దేశంలో 6 పార్టీలు మాత్రమే జాతీయ స్థాయి పార్టీలుగా గుర్తింపు పొందాయి. వీటిలో బీజేపీ, ఆప్, సీపీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ), నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ) ఉన్నాయి.
జాతీయ హోదా నిలబెట్టుకునేదెలా?
జాతీయ పార్టీ హోదా నిలబెట్టుకోవాలంటే, ఒక పార్టీ లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో మంచి పనీతీరు చూపించాలి. లోక్‌సభ ఎన్నికల్లో 4 లేదా అంతకుమించి రాష్ట్రాల్లో కానీ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కానీ చెల్లుబాటైన ఓట్లలో 6 శాతం ఓట్లు సాధించి ఉండాలి. కనీసం నాలుగు లోక్‌సభ సీట్లు ఉండాలి.
ఆప్‌కు ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం ఉందా?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 'అప్' అధికారం కోల్పోయినప్పటికీ ఇప్పటికిప్పుడు జాతీయ స్థాయి హోదాకు వచ్చే ముప్పు ఏమీ లేదనే చెప్పాలి. ఎందుకంటే..ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి చవిచూసినా 43 శాతం ఓటింగ్ షేర్ సాధించింది. గత ఏడాది జరిగిన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్' ఒక సీటు గెలుచుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో 2019 సార్వత్రిక ఎన్నికల్లో కంటే మెరుగ్గా 3 సీట్లు ఆప్ సాధించింది. పంజాబ్‌లో భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా 'ఆప్' ప్రభుత్వం అధికారంలో ఉంది. 2022 గుజరాత్ ఎన్నికల్లో 13 శాతం ఓటింగ్ శాతం పార్టీ దక్కించుంది. అయినప్పటికీ.. ఈ రాష్ట్రాల్లో ఆప్ పరిస్థితి దిగజారితే, ఉదాహరణకు ఈ నాలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రంలో 6 శాతం ఓటింగ్ దక్కించుకోకున్నా, రెండు సీట్లు కోల్పోయినా అప్పుడు జాతీయ స్థాయి పార్టీ హోదా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయి హోదాపై ఎన్నికల కమిషన్ తదుపరి సమీక్ష జరిపేనాటికి ఎలాంటి సమస్య రాకుంటే జాతీయ స్థాయి హోదాకు ప్రమాదం లేనట్టే.
ఇవి కూడా చదవండి
Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..
Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..
Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ
For More National News and Telugu News..
Updated Date - Feb 08 , 2025 | 10:01 PM