Delhi Assembly Elections: ఎగ్జిట్ పోల్స్‌లో బిగ్ ట్విస్ట్.. ఢిల్లీ ఓటరులు జై కొట్టింది ఎవరికంటే..
ABN , Publish Date - Feb 05 , 2025 | 07:00 PM
Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అనంతరం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో ఢిల్లీ ఓటరు.. బీజేపీకి పట్టం కట్టినట్లు అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. కానీ కేకే సర్వే మాత్రం ఆప్ మళ్లీ అధికారాన్ని హస్తగతం చేసుకొంటుందంటూ ప్రకటించింది.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 05: న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఢిల్లీ ఓటరు.. బీజేపీకి పట్టం కట్టినట్లు దాదాపు అన్ని సర్వేల్లో స్పష్టమైనట్లు ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా వెల్లడవుతోంది. అయితే కేకే సర్వే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ ఢిల్లీలో వరుసగా మరోసారి అధికారాన్ని చేపడుతోందంటూ తన సర్వేలో స్పష్టం చేసింది.
కానీ చాణక్య స్ట్రాటజీస్, పీపుల్స్ పల్స్, రిపబ్లిక్ పి మార్క్ మాత్రం బీజేపీదే హస్తిన పీఠమని తన సర్వేలో వెల్లడించింది. ఫిబ్రవరి 05వ తేదీన 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఇప్పటి వరకు 58.20 మేర పోలింగ్ శాతం నమోదయింది. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశాన్ని ఎన్నికల సంఘం అధికారులు కల్పించారు.
పీపుల్స్ పల్స్- కొడిమో సంస్థల సంయుక్త ఎగ్జిట్‌పోల్ సర్వే ప్రకారం.. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ జెండా ఎగరనుందని స్పష్టం చేసింది. ఈ సర్వేలో బీజేపీ 51 నుంచి 60, ఆప్ 10 నుంచి 19 స్థానాలను గెలుచుకొంటుందని పేర్కొంది. అయితే కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతరులకు చోటు దక్కదని వెల్లడించింది. అయితే ఢిల్లీలోని మహిళా ఓటర్లు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి జైకొట్టినట్లు పీపుల్స్ పల్స్ కొడిమో వెల్లడించింది.
ఇక చాణక్య స్ట్రాటజీస్: బీజేపీ 39 నుంచి 44 స్థానాలు, ఆప్ 25 నుంచి 28 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 2 నుంచి 3 స్థానాలు
కేకే సర్వేలో మాత్రం ఆప్ 39, బీజేపీ 22
రిపబ్లిక్ పిమార్క్: బీజేపీ 39 నుంచి 49, ఆప్ 21 నుంచి 31, కాంగ్రెస్ పార్టీ 01
For National News And Telugu News