Bihar: అసెంబ్లీ ఎన్నికల వేళ.. మళ్లీ ఆయనకే బీజేపీ అధ్యక్ష పగ్గాలు
ABN , Publish Date - Mar 04 , 2025 | 02:55 PM
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో కీలకమైన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో దిలీప్ జైశ్వాల్ తిరిగి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నిక ప్రాధాన్యతను సంతరించుకుంది.

పాట్నా: బీహార్ బీజేపీ (BJP) అధ్యక్షుడిగా ఆ పార్టీ మాజీ మంత్రి, సీనియర్ నేత దిలీప్ జైశ్వాల్ (Dilip Jaiswal) అధికారికంగా తిరిగి ఎన్నికయ్యారు. పార్టీ బీజేపీ కౌన్సిల్ ఇన్‌చార్జి మనోహర్ లాల్ కట్టార్ మంగళవారంనాడు ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో కీలకమైన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో దిలీప్ జైశ్వాల్ ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది.
Krishna waters: కృష్ణా జలాల కోసం ఆంధ్రాకు తమిళనాడు అధికారులు..
ఒక వ్యక్తికి ఒకే పదవి
బీజేపీలో "ఒక వ్యక్తికి ఒకే పదవి'' నిబంధనకు అనుగుణంగా నితీష్ క్యాబినెట్‌లో కీలకమైన రెవెన్యూ, భూ సంస్కరణల మంత్రి పదవికి జైశ్వాల్ గత ఫిబ్రవరి 26న రాజీనామా చేశారు. నితీష్ కుమార్ తిరిగి ఎన్డీయేలోకి చేరడం ద్వారా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో గత జనవరిలో నితీష్ మంత్రివర్గంలోకి జైశ్వాల్ వచ్చారు. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గత జూలైలో జైశ్వాల్ బాధ్యతలు చెపట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ ఫిబ్రవరి 25న పాట్నాలో సమావేశం అయింది. ఈ సమావేశానంతరం మంత్రి పదవికి రాజీనామా చేస్తు్న్నట్టు జైశ్వాల్ ప్రకటించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు
243 నియోజకవర్గాలున్న బీహార్ అసెంబ్లీకి షెడ్యూల్ ప్రకారం అక్టోబర్, నవంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలు 2020 అక్టోబర్-నవంబర్‌లో జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే గెలవడంతో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అనంతరం ఆగస్టు 2022లో ఎన్డీయేతో నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ తెగతెంపులు చేసుకుని ఆర్జేడీ సారథ్యంలోని మహాఘట్‌బంధన్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2024 జనవరిలో ఆర్జేడీ మహాకూటమికి జేడీయూ గుడ్‌బై చెప్పి తిరిగి ఎన్డీయేలోతో చేతులు కలిపింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఇవి కూడా చదవండి
Bird flu: బర్డ్‌ఫ్లూపై కలెక్టర్ ఏమన్నారంటే..
Akhilesh Yadav: మనుషులా? మరబొమ్మలా?.. వారానికి 90 గంటల పనిపై అఖిలేష్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.