MLA: మద్యం ప్రియులకు రెండు బాటిళ్లు ఉచితంగా ఇవ్వండి
ABN, Publish Date - Mar 20 , 2025 | 09:58 AM
దేవాలయంలాంటా అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే కోరిన కోరిక ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. మద్యంప్రియులకు రెండు బాటిళ్లు ఉచితంగా ఇవ్వండి.. అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనానికి దారితీశాయి.

శాసనసభలో జేడీఎస్ ఎమ్మెల్యే కృష్ణప్ప డిమాండ్
బెంగళూరు: మద్యంప్రియులకు వారానికి రెండు బాటిళ్లు ఉచితంగా ఇవ్వాలని శాసనసభలో తురువేకెరె నియోజకవర్గ జేడీఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప(JDS MLA MT Krishnappa) డిమాండ్ చేశారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా సభ్యుడు మాట్లాడుతూ సీఎం సిద్దరామయ్య ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అబ్కారీ ఆదాయం రూ.40వేల కోట్లకు పెంచుకున్నారన్నారు. త్వరలోనే మద్యం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. గత ఏడాది ప్రభుత్వం ఏకంగా మూడుసార్లు మద్యం ధరలు పెంచిందన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Uttar Pradesh: భర్తను చంపి, ముక్కలు చేసి.. సిమెంట్ డ్రమ్ములో వేసి..
ఇది పేదలపై తీవ్ర ప్రభావం చూపదా అని ప్రశ్నించారు. కార్మికవర్గాల సంపాదనలో ఎక్కువమొత్తం మద్యానికే ఖర్చు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. వారిని మద్యం నుంచి దూరం చేయలేమన్నారు. ఇలా ఏటా టార్గెట్‌లు పెంచుకుంటూ ధరలు పెంచితే సామాన్యుల పరిస్థితి ఏం కావాలన్నారు. గ్యారెంటీల పేరిట మహిళలకు శక్తి గ్యారెంటీ, ఉచిత విద్యుత్, గృహలక్ష్మి వంటి పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కనీసం మద్యం బాబులకు వారానికి రెండు బాటిళ్లను ఉచితంగా ఇవ్వాలన్నారు. ప్రభుత్వం మద్యం విక్రయాలను సొసైటీల ద్వారా అమలు చేయాలని సలహా ఇచ్చారు. అయితే పలువురు సభ్యులు మద్యనిషేధం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Bengaluru: రచ్చకెక్కిన దంపతుల వివాదం.. భార్య వేధిస్తోందని భర్త ఫిర్యాదు
RTC bus: అమ్మో.. పెద్దప్రమాదమే తప్పిందిగా.. ఏం జరిగిందంటే..
భార్య కన్నింగ్ ప్లాన్.. భర్తను చంపి.. అతడి వాట్సాప్ నుంచి..
Updated Date - Mar 20 , 2025 | 11:19 AM