Congress: డీకే మార్పు అనివార్యమైతే.. కొత్త సారధి ఈయనేనట..
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:44 PM
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) కొత్త సారధి నియామకం త్వరలోనే జరగనుందనే వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మార్పు అనివార్యమైతే ఆయన స్థానంలో మంత్రి ఈశ్వర్ ఖండ్రెకు అవకాశం దక్కనుందని అభిప్రాయాలు జోరందుకున్నాయి.

బెంగళూరు: రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shivakumar) మార్పు అనివార్యమైతే సీనియర్ నేత, అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రె(Minister Eshwar Khandre)కు అవకాశం దక్కనుందని అభిప్రాయాలు జోరందుకున్నాయి. పార్టీ అధిష్ఠానం కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. డీకే శివకుమార్ కేపీసీసీ అధ్యక్షుడిగా నాలుగేళ్లు కొనసాగారు. రెండో విడత కొనసాగించే అవకాశం లేద ని తెలుస్తోంది. అయితే కొంతకాలం జాప్యం జరిగే అవకాశాలు ఉండ వచ్చు నని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది.
ఈ వార్తను కూడా చదవండి: కాంగ్రెస్ దిద్దుబాట
ప్రస్తుతం డీకే శివకుమార్ కేపీసీసీ అధ్యక్ష పదవితోపాటు ఉపముఖ్యమంత్రి, బెంగళూరు నగరాభి వృద్ధిశాఖ మంత్రి, జలవనరులశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఒకరికి ఇన్ని పదవులు సమంజసం కాదని పార్టీ వర్గాలలో తీవ్ర వ్యతిరేకత ఉంది. అయితే అధ్యక్ష పదవి చేపట్టాక పార్టీ ప్రగతికి ఆయన చేసిన సేవలను అధి ష్ఠానం గుర్తించింది. ఒక పర్యాయం పూర్తి కాకుండా తొలగించడం సాధ్యం కాదని పలు సందర్భాలలో అగ్రనేతలు ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం పార్టీలో అంతా సమైక్యమని అనుకుంటున్నా సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah), డీసీఎం డీకే శివకుమార్‌ల గ్రూపులు తారస్థాయిలో కొనసాగుతున్నాయి. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన సమయంలో ఈ ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. అధిష్ఠానం వద్ద పలువురి పేర్లు ఉన్నా ఈశ్వర్‌ఖండ్రెవైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అందుకు పలు కారణాలు ఉన్నాయి. పార్టీలో సీనియర్‌గా ఉన్నా మంత్రిగా కొనసాగుతున్నా ఎక్కడా వివాదాలకు గురి కాలేదు. పైగా రెండు గ్రూపులకు తటస్ఠంగా ఉన్నారు. రెండు గ్రూపుల వారితోనూ సత్సంబంధాలు కొనసాగిస్తుండడంపై అధిష్ఠానం సానుకూలత చూపుతున్నట్టు తెలు స్తోంది.
ఇటీవలే ఈశ్వర్‌ఖండ్రె ఢిల్లీలో కుమారుడు, బీదర్ లోక్‌సభ సభ్యుడు సాగర్‌ఖండ్రె(Bidar MP Sagar Khandre)తో కలసి పార్టీ అగ్రనేత కేసీ వేణుగోపాల్‌ను భేటీ అయ్యారు. ఇద్దరూ సుదీర్ఘ సమ యంపాటు వారు చర్చించు కోవడం అనుమానాలకు తావి స్తోంది. ఈశ్వర్‌ఖండ్రెను కేపీసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక చేసేందుకు అధి ష్ఠానం పలు అంచనాలు వేసి న ట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో జనాభా కల్గిన వీరశైవలింగాయత సమాజా నికి చెందినవారు కావడం, సామా జికవర్గంలో పట్టు ఉండడం, అఖిలభారత వీరశైవమహాసభ కార్యా ధ్యక్షులుగా ఉండడం పార్టీకి క్రమశిక్షణ కల్గినవారు కావడం, వివాదాలు లేని వారు కావడం, పార్టీలో అనుభవం ఉండడం, ఇప్పటికే కేపీసీసీ కార్యాధ్య క్షుడి గా కొనసాగడం, కార్యకర్తలు నాయకులతో మంచి సంబంధాలు కలిగి ఉండ డం కారణాలుగా ఉన్నాయి. ఆయన తండ్రి భీమణ్ణఖండ్రెకు మంచి పేరు ఉండడం వంటివి సానుకూలతలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ వార్దలు కూడా చదవండి:
ప్రభుత్వం సంచలన నిర్ణయం..ఆ వాహనాలపై నిషేధం
సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామాలు
ఈయన మామూలోడు కాదు.. లక్కీ భాస్కర్ స్టైల్లో కోట్లు కొట్టేశాడు..