Share News

Chennai: నన్నే అనుమానిస్తారా.. ఎంజీఆర్‌-జయలలిత హయాంలోనే గుర్తింపు

ABN , Publish Date - Feb 14 , 2025 | 12:34 PM

దివంగత ముఖ్యమంత్రులు ఎంజీఆర్‌-జయ లేకుంటే తాను లేనని, వారి హయాంలోనే ఎంతో గుర్తింపు పొందిన తననే పార్టీలోని కొంతమంది అనుమానించడం శోచనీయమని అన్నాడీఎంకే సీనియర్‌ నేత, కేఏ సెంగోట్టయ్యన్‌(KA Sengottaiyan) ఆవేదన వ్యక్తం చేశారు.

Chennai: నన్నే అనుమానిస్తారా.. ఎంజీఆర్‌-జయలలిత హయాంలోనే గుర్తింపు

- అన్నాడీఎంకే నేత సెంగోట్టయ్యన్‌

- ద్రోహుల ఎత్తుగడలు పార్టీని నిర్వీర్యం చేయలేవు

- మాజీ మంత్రి ఉదయకుమార్‌ సెటైర్లు

చెన్నై: దివంగత ముఖ్యమంత్రులు ఎంజీఆర్‌-జయ లేకుంటే తాను లేనని, వారి హయాంలోనే ఎంతో గుర్తింపు పొందిన తననే పార్టీలోని కొంతమంది అనుమానించడం శోచనీయమని అన్నాడీఎంకే సీనియర్‌ నేత, కేఏ సెంగోట్టయ్యన్‌(KA Sengottaiyan) ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోడ్డు జిల్లా గోపిచెట్టి పాళయంలో గురువారం జరిగిన ఎంజీఆర్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఈరోడ్డు తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నిక ఉన్నందున ఈపీఎస్‌(EPS) అనుమతి మేరకే తాను ఈ వేడుకలను ఆలస్యంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..


తాను ఎంజీఆర్‌-జయ మార్గదర్శకంలో నడిచినవాడినని, రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడీఎంకే కార్యకర్తల పేర్లు తెలిసిన వ్యక్తిగా పేరుందన్నారు. జయకు సారధిగా వ్యవహరించానని, తననెవ్వరూ నియంత్రించలేరన్నారు. ఎంజీఆర్‌ హయాంలోనే పార్టీకి సేవలందించి గుర్తింపు పొందానన్నారు. ఇటీవల సేలంలో జరిగిన కార్యక్రమంలో ఎంజీఆర్‌-జయలలిత ఫొటోలు లేకపోవడం వల్లనే తాను హాజరు కాలేదన్నారు. కానీ ఆ కార్యక్రమాన్ని తాను బహిష్కరించలేదన్నారు. అయితే దీనిపైనే అన్నాడీఎంకేలో ప్రధానంగా చర్చ జరుగుతోందన్నారు. దీనిపై తానేమీ బాధ పడడం లేదని, తాను చాలా స్పష్టంగా వున్నానన్నారు. 43 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న తాను ఎప్పుడూ ఎక్కడా తప్పు మాట్లాడలేదని వ్యాఖ్యానించారు.


ఇదిలా ఉండగా.. ద్రోహుల ఎత్తుగడలు, వ్యూహాలు అన్నాడీఎంకేను నిర్వీర్యం చేయలేవని ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఆర్‌బి.ఉదయకుమార్‌ పరోక్షంగా సెంగోట్టయ్యన్‌కు చురక అంటించారు. ఉదయకుమార్‌ గురువారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దివంగత పురట్చితలైవి ఆశీస్సులతో అన్నాడీఎంకేకు ఎదురయ్యే కష్టాలు సులభంగా అధిగమిస్తామన్నారు. ఇపుడు కొత్తగా తెరపైకి తెస్తున్న వాదనలు, కొందరు చేస్తున్న ద్రోహాలు పార్టీని ఏమాత్రం నిర్వీర్యం చేయలేవన్నారు. ప్రజల కోసం పాటుపడే సంస్థ. జయలలిత చెప్పినట్టుగా ప్రజల వల్ల నేను.. ప్రజల కోసం నేను అనే నినాదం మేరకు పార్టీ నేతలంతా ఐకమత్యంతో పనిచేస్తారన్నారు.

nani3.2.jpg


ఈవార్తను కూడా చదవండి: ప్రమాణాలు పాటించకుండా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఆహార పదార్థాలు!

ఈవార్తను కూడా చదవండి: సంజయ్‌, కిషన్‌రెడ్డి.. కోతల రాయుళ్లు

ఈవార్తను కూడా చదవండి: ఎస్సీలలోని అన్ని కులాలకు తహసీల్దార్‌ ద్వారానే కుల ధ్రువీకరణ పత్రాలివ్వాలి

ఈవార్తను కూడా చదవండి: Mini Jatara.. మేడారంలో కొనసాగుతున్న మినీజాతర

Read Latest Telangana News and National News

Updated Date - Feb 14 , 2025 | 12:34 PM