Share News

Anganwadi Pay Hike: అంగన్వాడీల వేతనాన్ని రెట్టింపు చేయండి

ABN , Publish Date - Apr 03 , 2025 | 04:13 AM

అంగన్వాడీ కార్యకర్తల వేతనాన్ని రెట్టింపు చేయాలని, వారి కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్రానికి సిఫారసు చేసింది. అలాగే, ఖాళీగా ఉన్న 2.13 లక్షల అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయాలని సూచించింది

Anganwadi Pay Hike: అంగన్వాడీల వేతనాన్ని రెట్టింపు చేయండి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2: అంగన్వాడీ కార్యకర్తలకు గౌరవ వేతనం రెట్టింపు చేయాలని, వారి కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రానికి పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసు చేసింది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్‌ సింగ్‌ అధ్యక్షతన విద్య, మహిళలు, శిశు, యువజన, క్రీడల స్థాయీ సంఘం ఈ మేరకు ఏకగ్రీవంగా ప్రతిపాదించింది. మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖకు ఈ నివేదిక సమర్పించినట్టు కమిటీ చైర్మన్‌ దిగ్విజయ్‌ సింగ్‌ బుధవారం ‘ఎక్స్‌’లో వెల్లడించారు. ‘ఈ ఏడాది చివరినాటికి అంగన్వాడీలలో ఖాళీగా ఉన్న దాదాపు 2.13 లక్షల పోస్టులను భర్తీ చేయాలి’ అని కమిటీ సూచించినట్టు దిగ్విజయ్‌ వెల్లడించారు. గర్భిణీలకు అందించే మొత్తాన్ని రూ.5 వేలు నుంచి కనీసం రూ.6 వేలకు పెంచాలని సూచించినట్టు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

Waqf Bill 2024: మరోసారి దేశవిభజన కానీయం: అనురాగ్ ఠాకూర్

Waqf Amendment Bill: బిల్లులో ఒకే మార్పును కోరనున్న టీడీపీ.. అదేమిటంటే

Waqf: అసలేంటీ వక్ఫ్ బిల్లు, విపక్షాల రాద్ధాంతం దేనికి?

Line of Control: పాక్ కవ్వింపు చర్యలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్

For National News And Telugu News

Updated Date - Apr 03 , 2025 | 04:13 AM