Share News

Gujarat Drug Bust: రూ 1800 కోట్ల డ్రగ్స్‌ స్వాధీనం

ABN , Publish Date - Apr 15 , 2025 | 03:37 AM

గుజరాత్‌ తీరంలో ఐసీజీ, ఏటీఎస్‌ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో రూ.1,800 కోట్ల విలువైన 300 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు స్మగ్లర్లు పారిపోయే ముందు సముద్రంలో డ్రగ్స్‌ సంచులు పడేసారు

Gujarat Drug Bust: రూ 1800 కోట్ల డ్రగ్స్‌ స్వాధీనం

  • గుజరాత్‌ తీరంలో ఐసీజీ-ఏటీఎస్‌ బృందాల ఆపరేషన్‌

  • సముద్రంలో పడేసి పారిపోయిన స్మగ్లర్లు

అహ్మదాబాద్‌, ఏప్రిల్‌ 14: గుజరాత్‌ సముద్ర తీరంలో మరోసారి పెద్ద ఎత్తున డగ్ర్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1,800 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేశారు. అరేబియా సముద్రంలో ఈనెల 12-13 తేదీల మధ్య అర్ధరాత్రి భారత తీర రక్షక దళం(ఐసీజీ), గుజరాత్‌ తీవ్రవాద నిరోధక దళం సంయుక్త ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే ఓ బోటు కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో ఐసీజీ నౌక దాన్ని వెంబడించింది. దీంతో, ఆ బోటులోని స్మగ్లర్లు డ్రగ్స్‌ సంచులను సముద్రంలోనే పడేసి పారిపోయారు. అధికారులు ఆ సంచులను వెలికి తీసి చూడగా అందులో 300 కిలోల మెథంఫెటమిన్‌ డ్రగ్స్‌ ఉన్నట్లు తేలింది.


ఇవి కూడా చదవండి..

PM Modi: వక్ఫ్ నిబంధనలను స్వార్థం కోసం కాంగ్రెస్ మార్చేసింది: మోదీ

Ayodhya: అయోధ్య రామాలయ ట్రస్టుకు బెదిరింపు మెయిల్

India Laser Weapon: భారత్‌ అమ్ముల పొదిలో లేజర్‌ అస్త్రం

Supreme Court Review Petition Filed: గడువు వద్దు

Updated Date - Apr 15 , 2025 | 03:37 AM