Earthquake: ఢిల్లీలో భూకంపం... ఒక్కసారిగా కంపించిన భూమి
ABN , Publish Date - Feb 17 , 2025 | 06:32 AM
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజాము 5:36 గంటలకు కొద్ది సెకన్ల పాటు భూమి కంపించింది.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో భూకంపం (Earthquake) సంభవించింది. సోమవారం తెల్లవారుజాము 5:36 గంటలకు కొద్ది సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 4.0 గా నమోదు అయింది. ఢిల్లీతోపాటు నోయిడా, గురుగాం ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి.
ఈ వార్త కూడా చదవండి..
బాబోయ్ చికెన్.. కొయ్యవోయి మటన్!
దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూప్రంకపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ఎక్స్ వేదికగా తెలిపింది. భూకంప కేంద్రం లోతు కేవలం 5 కిలోమీటర్లు మాత్రమేనని స్పష్టం చేసింది. కొన్ని సెకన్ల పాటు మాత్రమే భూమి కంపించడంతో భయాందోళనలకు గురైన జనం ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. మంచం నుండి కిటికీ వరకు ప్రతిదీ కదలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఢిల్లీ భూకంపంపై ప్రధాని మోదీ స్పందన..
దేశ రాజధాని ఢిల్లీలో సంభవించిన భూకంపంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. మళ్లీ భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని... అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. భద్రతా చర్యలు పాటించాలని, పరిస్థితులను అధికారులు సునిశితంగా పరిశీలిస్తున్నారని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ నివాసం వద్ద గడ్డి ‘దహనం’పై సందేహాలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News