Mother Rescue Child: తల్లి ప్రేమకు నిదర్శనం ఈ వీడియో.. హ్యాట్సాఫ్ అమ్మ
ABN , Publish Date - Apr 12 , 2025 | 09:07 AM
తనకు ఏమైనా సహిస్తుంది.. భరిస్తుంది కానీ బిడ్డల విషయానికి వస్తే.. మాత్రం అందుకు పూర్తిగా విభన్నంగా ప్రవర్తింది తల్లి. వారి కోసం చావుతో సైతం పోరాడుతుంది. బిడ్డల క్షేమం కోసం ఓ తల్లి ఎలాంటి సాహసం చేయగలదో కళ్లకు కట్టినట్లు చూపే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

గాంధీనగర్: సాధారణంగా ఆడవారు చాలా భయస్తులు అంటారు. కానీ పరిస్థితి తమ చేయి దాటినప్పుడు.. అందునా కడుపున పుట్టిన బిడ్డలకు ప్రమాదం ఎదురుకాబోతుందని తెలిస్తే.. వారిలోని మహా శక్తి మేల్కొంటుంది. ప్రాణాలకు తెగించి మరీ బిడ్డల ప్రాణాలు కాపాడుతుంది తల్లి. అందుకోసం ఎంతటి సాహసం చేయడానికి అయినా వెనకాడదు. తాజాగా ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అగ్ని ప్రమాదం నుంచి బిడ్డలను కాపాడటం కోసం ఓ తల్లి చేసిన సాహసం చూసి నెటిజనులు షాక్ అవుతున్నారు. హ్యాట్సాఫ్ అమ్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు..
ఈ సంఘటన గుజరాత్, అహ్మదాబాద్‌లో వెలుగు చూసింది. ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తన పిల్లలను కాపాడటం కోసం ఓ తల్లి సాహసం చేసింది. బాల్కనీ నుంచి ఇద్దరి పిల్లలను ఒకరి తర్వాత ఒకరిని కిందకు దించింది. స్థానికుల సాయం, తన ధైర్యంతో బిడ్డలను కాపాడుకుంది. ప్రమాదం విషయానికి వస్తే.. అహ్మదాబాద్లోని ఖోఖ్రా ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని ఆరో అంతస్తులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాదం కారణంగా అపార్ట్‌మెంట్‌లో దట్టమైన పొగతో కూడిన మంటలు చెలరేగాయి. ఫైర్ యాక్సిడెంట్ గురించి తెలిసి అపార్ట్‌మెంట్ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్కడ నుంచి తప్పించుకుని క్షేమంగా బయటకు రావడానికి ఎవరికి తోచిన ప్రయత్నాలు వారు చేయసాగారు. ఈ క్రమంలో ప్రమాదం చోటు చేసుకున్న అపార్ట్‌మెంట్‌లో ఓ మహిళ, తన కుటుంబంతో కలిసి జీవిస్తుంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పిల్లలను కాపాడటం కోసం ఆ తల్లి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది.
పిల్లలను బాల్కనీ నుంచి కిందకు పంపించాలని భావించిన మహిళ.. స్థానికుల సాయంతో విజయవంతంగా బిడ్డలను కాపాడుకుంది. ముందుగా చిన్న కుమార్తెను గాల్లో వేలాడిస్తూ.. చిన్నారిని కాపాడాలని కోరింది. స్పందించిన స్థానికులు ఆ చిన్నారిని క్యాచ్ చేశారు. ఆ తర్వాత పెద్ద బిడ్డను కూడా అలానే బాల్కనీ నుంచి కిందకు పంపింది. ఆ తర్వాత ఆమె కూడా బాల్కనీ నుంచి కిందకు వెలాడుతూ.. కాపాడమని కోరింది. స్పందించిన ఇద్దరు వ్యక్తులు ఆమెను క్షేమంగా కిందకు దించారు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజనులు సదరు మహిళ చేసిన సాహసాన్ని ప్రశంసిస్తున్నారు. ఇక ప్రమాదం గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంద అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. సుమారు 20 మంది అపార్ట్‌మెంట్ వాసులను క్షేమంగా కాపాడారు. ప్రమాదానికి గల కారణాలు వెలికి తీసే పనిలో ఉన్నారు పోలీసులు.
ఇవి కూడా చదవండి:
PDA At Metro Station: మీ కక్కుర్తి తగలెయ్య.. పబ్లిక్‌లో ఇదేం పని..
Jammu Kashmir: ఆపరేషన్ చత్రు..ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు