Child Crime Justice: కర్ణాటకలో ఐదేళ్ల చిన్నారిపై హత్యాచారం
ABN , Publish Date - Apr 14 , 2025 | 03:55 AM
కర్ణాటక హుబ్బళ్లిలో ఐదేళ్ల చిన్నారిపై పాశవిక హత్యాచారం జరగగా, నిందితుడు రితేశ్‌కుమార్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమర్చారు. ఘటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి

ఎన్‌కౌంటర్‌లో నిందితుడి హతం
బెంగళూరు, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): ఇంటిముందు ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశచూపి అత్యాచారానికి పాల్పడ్డాడో మానవమృగం. అనంతరం ఎవరికైనా చెబుతుందనే భయంతో గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత పోలీసు కాల్పుల్లో హతమయ్యాడు. కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లి నగరంలో ఆదివారం జరిగిందీ ఘటన. కొప్పళకు చెందిన ఓ కుటుంబం ఉపాధి నిమిత్తం హుబ్బళ్లికి వలస వచ్చింది. చిన్నారి తండ్రి పెయింటర్. తల్లి గృహిణి. ఆదివారం ఉదయం తండ్రి పనికి వెళ్లగా, తల్లి ఇంట్లో పనిచేసుకుంటోంది. చిన్నారి ఇంటి బయట ఆడుకుంటుండగా, ఒక యువకుడు చాక్లెట్ ఆశ చూపి ఆమెను సమీపంలోని ఓ పాడుబడిన షెడ్డుకు తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారానికి పాల్పడి కిరాతకంగా హత్య చేశాడు. తల్లిదండ్రులు తమ ఇంటి సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి ఓ యువకుడు బాలికను ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. షెడ్డులో చిన్నారి శవమై కనిపించడంతో ప్రజా, కన్నడ, యువసంఘాలు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. మరోవైపు, నిందితుడిని బిహార్‌కు చెందిన రితేశ్‌కుమార్‌గా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. అతడు తప్పించుకునే ప్రయత్నంలో ఎదురు దాడికి దిగగా పోలీసులు కాల్పులు జరిపారు. రితేశ్‌కుమార్ ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో ఎస్‌ఐ, ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Capital Amaravati: మరో 30 వేల ఎకరాల భూ సమీకరణకు రంగం సిద్ధం
IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ
AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..
TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
For National News And Telugu News