ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Former minister: విద్వేషాలకు ప్రభుత్వ వైఖరే కారణం

ABN, Publish Date - Jan 14 , 2025 | 12:13 PM

రాష్ట్రంలో తరచుగా సాగుతున్న విధ్వషాలు, తలెత్తుతున్న అశాంతికి కారణం ప్రభుత్వం అనుసరిస్తున్న ధ్వంద్వ విధానాలేనని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు కేఎస్‌ ఈశ్వరప్ప(Former minister and senior BJP leader KS Eshwarappa) ఆరోపించారు.

- మాజీ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప ధ్వజం

- కాంగ్రెస్‌ సర్కార్‌ పై తీవ్ర స్థాయిలో విమర్శలు

రాయచూరు(బెంగళూరు): రాష్ట్రంలో తరచుగా సాగుతున్న విధ్వషాలు, తలెత్తుతున్న అశాంతికి కారణం ప్రభుత్వం అనుసరిస్తున్న ధ్వంద్వ విధానాలేనని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు కేఎస్‌ ఈశ్వరప్ప(Former minister and senior BJP leader KS Eshwarappa) ఆరోపించారు. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న పలు పరిణామాలు ప్రభుత్వ పెద్దల అనుచిత వ్యాఖ్యాల వల్లేనని ఆయన స్పష్టం చేశారు. ఆవుల పొదుగులను కోయడం అందులో భాగమేనని ఇందుకు ప్రభుత్వమే భాధ్యత వహించాలని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ వార్తను కూడా చదవండి: Ministers: మంత్రులకు దడ పుడుతుందోచ్... 31మంది పనితీరుపై ఏఐసీసీకి నివేదిక


జిల్లా పర్యటనకు వచ్చిన మాజీ మంత్రి ఈశ్వరప్ప, సోమవారం నగరంలో కొద్దిసేపు విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలో రూపుదిద్దుకున్న గో హత్య నిషేధ చట్టాన్ని పశుబలి చట్టాలను నిర్విర్యం చేస్తు వాటిని రద్దు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రకటించడం వల్లే ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ నుంచి తప్పుడు సంకేతాలు వెలువడుతుండడం వల్లే వివిధ రకాల మూకలు చెలరేగిపోతున్నాయని ఆరోపించారు.


తాను బీసీ నాయకుడినంటు ఇటీవల పలు సందర్భాల్లో గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తమ స్వంత కులస్తులను కలిసేందుకు కూడా ఇష్టపడడం లేదని ఈ విషయంలో సాక్షాత్తు కాగినెలె పీఠాధిపతి శివానంద స్వామి అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని ఈశ్వరప్ప ప్రస్తావించారు. కేవలం కులం,మతం పేర్లను కాంగ్రెస్‌ నాయకులు ఓట్ల కోసమే వాడుతున్నారని నిజంగా ఆయా కులాల పట్ల జాతుల పట్ల ఆ పార్టీకి నాయకులకు ఎలాంటి నిభద్ధత లేదన్నారు.


కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల్లో కులం పేరుతో నాయకత్వాలు ఉంటాయని చెప్పుకోవడం పట్ల మాజీ మంత్రి అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో ఇప్పటికే బీసీలంతా సిద్ధరామయ్య గ్రూప్‌గా ఒక్కలిగలు డీకే శివకుమార్‌(DK Shivakumar) గ్రూపులుగా వీడిపోయి ప్రజల్లో అసంతృప్తికి కారణమైయ్యారని ఇది కాంగ్రెస్‌ సంస్కృతి అని మాజీ మంత్రి అన్నారు. విధాన పరిషత్‌లో బీజేపీ నాయకుడు సీటి రవి, మంత్రి లక్ష్మి హెబ్బాళ్‌కర్‌(CT Ravi, Minister Lakshmi Hebbalkar) వ్యవహారానికి సంబంధించి సభాపతి ఇచ్చిన రూలింగ్‌ను ప్రభుత్వం పెడిచెవన పడుతుండడం బాధ్యతరాహిత్యమన్నారు. ఒకవైపు రాజ్యాంగ పరిరక్షణ తమ ఉద్దేశమంటునే సభాపతి స్థానాన్ని అగౌరవ పరచడం ఏ పాటి విలువలని ఈశ్వరప్ప ప్రశ్నించారు.


ఈవార్తను కూడా చదవండి: గాలిపటం ఎగురవేస్తూ విద్యుదాఘాతంతో బాలుడి మృతి

ఈవార్తను కూడా చదవండి: పండుగ నాడు... పోషక శోభ

ఈవార్తను కూడా చదవండి: MLC K Kavitha: పోచారంపై నిప్పులు చెరిగిన కవిత

ఈవార్తను కూడా చదవండి: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 14 , 2025 | 12:13 PM