Sajjan Kumar: మాజీ ఎంపీకి జీవిత ఖైదు
ABN , Publish Date - Feb 25 , 2025 | 03:17 PM
Sajjan Kumar: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు ప్రతీకారంగా.. పలు బృందాలు మరణాయుధాలతో సిక్కుల ఆస్తులపై దాడులకు తెగబడ్డాయి. ఆ క్రమంలో వారి ఆస్తులను దోచుకోవడం, దహనం చేయడంతోపాటు ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో జశ్వంత్ సింగ్‌తోపాటు ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్ మరణించారు.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: ఢిల్లీ అల్లర్ల కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు ఢిల్లీ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం ఈ తీర్పును వెలువరించారు. 1984 నవంబర్ 1వ తేదీన తన భర్త జశ్వంత్ సింగ్‌తోపాటు తన కుమారుడు తరుణ్ దీప్ సింగ్‌లను హత్య చేశారంటూ జశ్వంత్ భార్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు కోర్టు ఈ శిక్ష విధించింది.
అయితే సజ్జన్ కుమార్ ప్రస్తుతం తీహాడ్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. 1984 అక్టోబర్ చివరి వారంలో నాటి ప్రధాని ఇందిరాగాందీని ఆమె అంగరక్షకులు కాల్చి చంపారు. అనంతరం దేశ రాజధాని న్యూఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. అదే సమయంలో సిక్కులు ఊచకోత ఘటనలు చోటు చేసుకొన్నాయి. ఆ క్రమంలో తన భర్తతోపాటు తన కుమారుడిని హత్య చేశారని.. అందులో మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ ప్రమేయం ఉందంటూ మృతుడు జశ్వంత్ సింగ్ భార్య పంజాబీ బాగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ప్రత్యేక బృందం విచారణ జరిపి.. కోర్టుకు ఇటీవల నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు ప్రతీకారంగా.. పలు బృందాలు మరణాయుధాలతో సిక్కుల ఆస్తులపై దాడి చేశాయి. ఆ క్రమంలో వారి ఆస్తులను దోచుకోవడం, దహనం చేయడంతోపాటు ధ్వంసం చేశాయంటూ ప్రాసిక్యూషన్ ఆరోపించింది. సదరు బృందం పలు నివాసాలపై దాడి చేసి.. వస్తువులను దోచుకోవడంతోపాటు పలువురిని హతమార్చడమే కాకుండా.. ఇళ్లకు సైతం నిప్పు పెట్టారంటూ ప్రాసిక్యూషన్ ఆరోపించిన విషయం విధితమే.
ఈ కేసులో ఎప్పుడు ఏం జరిగిందంటే..
1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల సందర్భంగా ఇద్దరు వ్యక్తుల హత్య కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు మంగళవారం జీవిత ఖైదు విధించింది.
1991లో ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర నమోదు అయింది.
1994, జులై 8: ప్రాసిక్యూషన్ ప్రారంభించడానికి తగిన ఆధారాలు లేవని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. దీంతో సజ్జన్ కుమార్‌పై ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేయలేదు.
2015, ఫిబ్రవరి 12: ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
2016, నవంబర్ 21: ఈ కేసులో మరింత దర్యాప్తు అవసరమని కోర్టుకు ప్రత్యేక దర్యాప్తు బృందం తెలిపింది.
2021, ఏప్రిల్ 6: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ అరెస్ట్.
2021, మే 5: పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు.
జులై 26: ఛార్జ్ షీట్‌ను కోర్టు పరిగణలోకి తీసుకుంది.
అక్టోబర్ 01: ఈ కేసులో వాదనలు వినడాన్ని కోర్టు ప్రారంభించింది.
డిసెంబర్ 16: హత్య, అల్లర్లతోపాటు ఇతర నేరాలకు సంబంధించిన అభియోగాలను మోపింది.
2024, జనవరి 31: తుది తీర్పు కోసం కోర్టులో ప్రారంభమైన వాదనలు
నవంబర్ 8: ఈ కేసులో కోర్టు తీర్పును రిజర్వు చేసింది.
2025, ఫిబ్రవరి 12: ఈ కేసులో సజ్జన్ కుమార్‌ను నిందితుడిగా కోర్టు నిర్ధారించింది.
ఫిబ్రవరి 25: సజ్జన్ కుమార్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది.
For National News And Telugu News