Church Festival Tragedy: చర్చి ఉత్సవాల్లో విషాదం.. అందరూ చూస్తుండగానే..
ABN , Publish Date - Mar 02 , 2025 | 09:44 AM
కన్యాకుమారి: తమిళనాడులో ఘోర విషాదం చోటు చేసుకుంది. చర్చి ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తూ విద్యాదాఘాతంతో నలుగురు యువకులు మృతిచెందారు.

కన్యాకుమారి: తమిళనాడు(Tamil Nadu)లో ఘోర విషాదం చోటు చేసుకుంది. చర్చి ఉత్సవాల (Church Festival) కోసం ఏర్పాట్లు చేస్తూ విద్యాదాఘాతంతో నలుగురు యువకులు మృతిచెందారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా (Kanyakumari District) ఎనాయం పుతేంతురైలోని సెయింట్ ఆంథోనీ చర్చి (Saint Anthony Church) పండగను ప్రతి ఏటా భక్తులు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇదే క్రమంలో ఈ ఏడాదీ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించాలని పాస్టర్లు భావించారు.
ఈ మేరకు ఏర్పాట్లన్నీ చకాచకా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ పనుల్లో జీసస్ ఫాలోవర్లు, స్థానిక యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. పండగ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన రథంపై ఏసుక్రీస్తును ఊరేగిస్తుంటారు. దీంతో రథానికి సుందరీకరణ పనులు చేసేందుకు కొంతమంది యువకులు ఇవాళ (ఆదివారం) ఉదయం సిద్ధమయ్యారు. పనుల కోసం ఇనుప నిచ్చెనను తీసుకెళ్తుండగా హైవోల్టేజీ వైర్లకు అది తగిలింది. దీంతో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. గిలగిలా కొట్టుకుంటూ కాలిపోతూ ప్రాణాలు విడిచారు.
కాలిపోతున్న యువకులను చూస్తూ నిస్సహాయ స్థితిలో స్థానికులు కన్నీటిపర్యంతం అయ్యారు. మృతులను మైఖేల్ పింటో, మరియా విజయన్, బి.శోభన్, ఆంటోనీగా పోలీసులు గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యుదాఘాతానికి సంబంధించిన వీడియోలను కొంతమంది తమ సెల్ ఫోన్లలో రికార్డు చేశారు. కాగా, ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Bolivia Road Accident: ఆ దేశంలో ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని.. బాబోయ్..
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలు ఎంతకు పెరిగాయో తెలుసా..