Share News

Air Hostess: ఎయిర్‌హోస్టేస్‌పై దారుణం.. వెంటిలేటర్ మీద ఉన్నా ఆగని వేధింపులు

ABN , Publish Date - Apr 16 , 2025 | 08:30 AM

ఆస్పత్రి వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ మీద జాలి పడాల్సింది పోయి.. దారుణంగా ప్రవర్తించారు. కామంతో కళ్లు మూసుకుపోయి.. పేషెంట్ అని జాలి కూడా చూపకుండా.. లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆ వివరాలు..

Air Hostess: ఎయిర్‌హోస్టేస్‌పై దారుణం.. వెంటిలేటర్ మీద ఉన్నా ఆగని వేధింపులు

గురుగ్రామ్: ఐసీయూ వెంటిలేటర్ మీద ఉన్నారంటేనే.. వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అర్థం. దేవుడి దయ, డాక్టర్ల వైద్యం వల్ల ప్రాణాలు దక్కితే చాలు అనుకుంటారు. ఎవరైనా ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్నారంటే.. వారు క్షేమంగా తిరిగి రావాలని.. దేవుడిని ప్రార్థిస్తారు. మంచి, మానవత్వం ఉన్న వారు ఎవరైనా సరే ఇలానే ఆలోచిస్తారు. కానీ కామంతో కళ్లు మూసుకు పోయిన వారికి ఇవేం పట్టవు. తమ కోరిక తీర్చుకోవడానికి పసికందులను సైతం వదలని మృగాళ్లు.. ఆస్పత్రి బెడ్ మీద ఉన్న వారిపై జాలి చూపుతారనుకోవడం మూర్ఖత్వం. ఇది నిజమని నిరూపించే దారుణ ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్న ఎయిర్‌హోస్టెస్‌పై అఘాయిత్యానికి పాల్పడ్డారు ఓ కామాంధులు. ఆ వివరాలు..


అసలేం జరిగిందంటే..

ఈ దారుణం హరియాణా, గురుగ్రామ్‌లో పది రోజుల క్రితం అనగా ఏప్రిల్ 6, 2025 నాడు చోటు చేసుకుంది. బాధితురాలి భర్త ఏప్రిల్ 13 పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎయిర్‌హోస్టెస్‌గా పని చేస్తున్న 46 సంవత్సరాల మహిళ ఒకరు.. కంపెనీ ట్రైనింగ్ నిమిత్తం ఏప్రిల్ 4న గురుగ్రామ్‌ వచ్చింది. అక్కడ ఉన్న ఓ హోటల్‌లో బస చేసింది. ఈ క్రమంలో హోటల్‌లో ఉన్న స్విమ్మింగ్ ఫూల్‌లో ఈత కొడుతుండగా.. జారిపడింది.


అది గమనించిన హోటల్ సిబ్బంది ఆమెను వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఆమె భర్తకు సమాచారం అందించారు. అయితే అప్పటికే ఎయిర్‌హోస్టెస్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమె భర్త.. ఏప్రిల్ 5న బాధితురాలిని మరో ఆస్పత్రికి తరలించాడు. సుమారు 9 రోజుల పాటు ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత ఏప్రిల్ 13న ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఆస్పత్రి నుంచి వచ్చిన తర్వాత బాధితురాలు పోలీసులు వద్దకు వెళ్లి.. హస్పిటల్లో ఉండగా తనకు ఎదురైన దారుణం గురించి భర్తకు చెప్పడంతో.. అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


వెంటిలేటర్‌పై ఉండగా వేధింపులు..

ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.. "నా ఆరోగ్యం విషమించడంతో.. ఏప్రిల్ 6 వెంటిలేటర్ మీద పెట్టి చికిత్స అందిస్తున్నారు. ఈ సమయంలో ఆస్పత్రి సిబ్బంది కొందరు నాపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వారు చేసే దారుణం గురించి నాకు తెలుస్తుంది.. కానీ నేను మాట్లాడలేకపోతున్నాను. మత్తులో ఉన్నాను. దారుణం ఏంటంటే.. అక్కడే ఇద్దరు నర్సులు కూడా ఉన్నారు. కానీ వారు కనీసం స్పందించలేదు. ఆ సమయంలో నేను ఏం చేయలేకపోయాను" అని చెప్పుకొచ్చింది.


ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక తనకు ఎదురైన దారుణం గురించి భర్తకు చెప్పింది. అతడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆస్పత్రికి వెళ్లి ఆ రోజు డ్యూటీలో ఉన్న సిబ్బంది ఎవరు అని ఆరా తీశారు. సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలించారు. అయితే ఆస్పత్రి సిబ్బంది మాత్రం దీన్ని ఖండిస్తుంది.

ఇవి కూడా చదవండి:

Hyderabad: అమ్మాయిలను అడ్డుపెట్టుకుని కాసుల వేట

Overnight Millionaire: తలరాతను మార్చిన పాత పాస్‌బుక్.. రాత్రికి రాత్రే లక్షాధికారి ఎలా అయ్యాడంటే..

Updated Date - Apr 16 , 2025 | 08:34 AM