Share News

Girl Friend: లవర్ కోసం పెద్ద సాహసమే చేశాడు.. కానీ అడ్డంగా బుక్కయ్యాడు

ABN , Publish Date - Apr 12 , 2025 | 01:34 PM

ప్రేమికురాలి కోసం ఓ యువకుడు పెద్ద సాహసమే చేశాడు. మరి కాసేపట్లో వారి ప్లాన్ సక్సెస్ అవుతుందని భావిస్తుండగా.. ఊహించని షాక్ తగిలింది. అడ్డంగా బుక్కయ్యారు లవర్స్ ఇద్దరు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

Girl Friend: లవర్ కోసం పెద్ద సాహసమే చేశాడు.. కానీ అడ్డంగా బుక్కయ్యాడు
Haryana university suitcase inciden

చండీగఢ్: ప్రేమించిన వారిని కలవడం కోసం లవర్స్ పడే పాట్లు ఉంటాయి చూడండి అబ్బో మాటల్లో వర్ణించలేము. తల్లిదండ్రులు, తెలిసిన వారి కంట పడకుండా రహస్యంగా కలుసుకునేందుకు చిన్న సైజు యుద్ధమే చేస్తారు. అయితే కొన్ని సార్లు వారి ప్రయత్నాలు బెడిసికొట్టి అడ్డంగా బుక్కవుతారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడటం కోసం బయటక ఎక్కడ ప్రైవసీ దొరకడం లేదని భావించిన యువకుడు ఆమెను తన హస్టల్‌కి తీసుకెళ్దామని భావించాడు. మరి బాయ్స్ హస్టల్‌కి అమ్మాయి వస్తుందంటే అనుమతించరు కదా.. అందుకే వారి కన్ను కప్పి ప్రియురాలిని హాస్టల్‌కి తీసుకెళ్లడం కోసం బ్రహ్మండమైన ప్లాన్ వేశాడు. అయితే ఆఖర్లో అది కాస్త బెడిసి కొట్టడంతో అడ్డంగా బుక్కయ్యి నేల చూపులు చూడాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.


ఈ సంఘటన హరియాణా, సోనిపట్ ప్రాంతంలో ఉన్న ప్రైవేటు విశ్వవిద్యాలయం.. ఓపీ జిందాల్ యూనివర్శిటీలో వెలుగు చూసింది. యూనివర్శిటీలో చదువుతున్న ఓ విద్యార్థి.. బాలీవుడ్ మసాలా మూవీ సీన్‌ని రియల్‌గా క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు. సినిమాలో మాదిరే తన ప్రియురాలిని బాయ్స్ హస్టల్‌కి తీసుకురావడం కోసం పెద్ద సాహసమే చేశాడు. ఆ యువతిని ఓ పెద్ద సైజు సూటుకేసులో పెట్టి.. లాక్కొచ్చాడు.

అయితే అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది సూట్‌కేసు ఓపెన్ చేసి చూడగా.. అతగాడు వ్యవహారం కాస్త బట్టబయలు అయ్యింది. అందరి ముందు అడ్డంగా దొరికిపోవడంతో నేల చూపులు చూస్తూ నిల్చనున్నాడు. విషయం తెలుసుకున్న యూనివర్శిటీ యాజమాన్యం సదరు విద్యార్థిపైన చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యింది.


ఈ వీడియో వైరల్ కావడంతో మీమర్స్ పండగ చేసుకుంటున్నారు. చాలా మంది సూపర్ ఐడియా బ్రో.. కానీ సూట్‌కేస్ కాస్త పెద్ది అయి ఉంటే బాగుండేది.. ఈ ఐడియా చూసి చాలా మంది ఇన్‌స్ఫైర్ అవుతారు.. నాకు కూడా ఈ ఆలోచనను అమలు చేయాలని ఉంది.. కానీ ఇప్పుడు నా వయసు అందుకు సహకరించదు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు. చాలా మంది నెటిజనులు ఆ విద్యార్థిపై సానుభూతి చూపుతున్నారు.


ఇవి కూడా చదవండి:

MS Dhoni IPL 2025: వరుసగా 5 ఓటములు.. తప్పు ధోనీది కాదు.. వాళ్లదే

కాల్పులతో దద్దరిల్లిన బీజాపూర్.. మావోల హతం

Updated Date - Apr 12 , 2025 | 02:16 PM