ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hero Vijay: హీరో విజయ్ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

ABN, Publish Date - Jan 12 , 2025 | 01:11 PM

ప్రజలను నమ్మించి మోసం చేయడమే పాలకుల ప్రధాన లక్ష్యంగా కనబడుతోందని, అందుకు నీట్‌ రద్దు హామీ ప్రకటన చక్కటి ఉదాహరణ అని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్‌(Actor Vijay) డీఎంకే ప్రభుత్వంపై తన ఎక్స్‌ పేజీలో ధ్వజమెత్తారు.

- ప్రజలను నమ్మించి మోసం చేశారు

- నీట్‌ రద్దు హామీ చక్కటి ఉదాహరణ

- టీవీకే అధినేత విజయ్‌ ధ్వజం

చెన్నై: ప్రజలను నమ్మించి మోసం చేయడమే పాలకుల ప్రధాన లక్ష్యంగా కనబడుతోందని, అందుకు నీట్‌ రద్దు హామీ ప్రకటన చక్కటి ఉదాహరణ అని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్‌(Actor Vijay) డీఎంకే ప్రభుత్వంపై తన ఎక్స్‌ పేజీలో ధ్వజమెత్తారు. ప్రస్తుత పాలకులను చూస్తుంటే.. ఇంకెంతకాలం జనాన్ని ఏమారుస్తారోననే ఎంజీర్‌ సినిమా పాటే గుర్తుకు వస్తోందన్నారు. ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని హామీల వర్షం కురిపించి, నమ్మించి మోసం చేయాలని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా అదేపనిగా ప్రజలను మోసగిస్తూనే ఉండాలి అనే ప్రధాన లక్ష్యంతోనే ప్రస్తుత పాలకులు వ్యవర్తిస్తున్నారని విమర్శించారు.

ఈ వార్తను కూడా చదవండి: Chief Minister: నాన్న అనే ఆ పిలుపే మా పాలనకు కితాబు


ఈ ఆరోపణకు తాను ఎన్నో ఆధారాలను చూపవచ్చని, మచ్చుకు నీట్‌ రద్దు ఒకటన్నారు. 2012 ఎన్నికల ప్రచార సమయంలో తాము అధికారంలోకి రాగానే నీట్‌ను రద్దు చేస్తామని, ఆ పరీక్షలను ఎలా రద్దు చేయాలన్న రహస్యం తమకు మాత్రమే తెలుసునని ప్రచారం చేసి, తమిళ ప్రజానీకాన్ని నమ్మించారన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక దాన్ని రద్దు చేసే అధికారం కేంద్రప్రభుత్వానికే ఉందని, రాష్ట్రానికి లేదని చెప్పడం ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మోసగించడమే కదా అని విజయ్‌(Vijay) పశ్నించారు. రానున్న ఎన్నికల్లోనూ ఆచరణకు సాధ్యంకాని అసత్య హామీలను ప్రకటించి తమిళ ప్రజల మోసగించవచ్చని కలలు కంటున్న పాలకుల కోరికలు ఎట్టి పరిస్థితులలోనే నెరవేరే అవకాశం లేదని విజయ్‌ పేర్కొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Travel Rush: పట్నం బైలెల్లినాదో!

ఈవార్తను కూడా చదవండి: HMDA: మహా అప్పు కావాలి!

ఈవార్తను కూడా చదవండి: నిర్మాణంలోని 11 విల్లాలు నేలమట్టం

ఈవార్తను కూడా చదవండి: నాకు ఆ భూమితో సంబంధం లేదు..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 12 , 2025 | 01:11 PM