IIT Baba: ఐఐటీ బాబాపై గంజాయి కేసు, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు
ABN , Publish Date - Mar 03 , 2025 | 06:15 PM
కొద్దిపాటి గంజాయి కూడా దొరకడంతో ఆయనపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. తక్కువ స్థాయి అఫెన్స్ కావడంతో ఆయనను పోలీసులు హెచ్చరించి విడిచిపెట్టారు.

జైపూర్: ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో ఐఐటీ బాబా (IIR Baba)గా పాపులారిటీ సంపాదించుకున్న అభయ్ సింగ్‌పై జైపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన బసచేసిన హోటల్‌లో ఏదో గందరగోళం జరుగుతోందని షిప్రాపథ్ పోలీసు స్టేషన్‌కు సోమవారంనాడు సమాచారం రావడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన గంజాయి సేవిస్తుండటంతో అదుపులోకి తీసుకున్నారు. కొద్దిపాటి గంజాయి కూడా దొరకడంతో ఆయనపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. తక్కువ స్థాయి అఫెన్స్ కావడంతో ఆయనను పోలీసులు హెచ్చరించి విడిచిపెట్టారు.
Ranveer Allahbadia: అల్హాబాదియాకు సుప్రీంలో ఊరట.. ప్రసారాలకు అనుమతి
సూసైడ్ బెదిరింపు..
కాగా, పోలీసు చర్య అనంతరం ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆయన బెదిరించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన మద్దతుదారుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీనిపై పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. అయితే, ఐఐటీ బాబా అరెస్టు ప్రచారం నడుమ ఆయన తన భక్తుల మధ్య పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ కనిపించడం ఆసక్తికరంగా మారింది.
ఐఐటీ బాబా వివరణ
కాగా, తాను సూసైడ్ చేసుకుంటానన్న వార్తలో నిజం లేదని ఐఐటీ బాబా వివరణ ఇచ్చారు. అయితే తనపై పోలీసులు కేసు నమోదు చేయడం నిజమేనని, బెయిలు కూడా మంజూరైందని చెప్పారు.
పోలీసులు ఏమన్నారంటే..
ఐఐటీ బాబా విషయంలో జరిగిన వరుస పరిణామాలపై షిప్రపథ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ రాజేంద్ర గోదరా మరింత వివరణ ఇచ్చారు. "బాబా అబయ్ సింగ్ అలియాస్ ఐఐటీ బాబా ఒక హోటల్‌లో ఉన్నారని, ఆయన ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని మాకు సమాచారం వచ్చింది. మేము అక్కడకు చేరుకునే సరికి ఆయన గంజాయి తీసుకున్నట్టు మాతో చెప్పారు. ఇంకొంచెం తన దగ్గర ఉందని, స్పృహలో లేనప్పుడు ఏదైనా చెప్పి ఉండవచ్చనని ఆయన తెలిపారు. ఎన్‌డీపీఎస్ చట్టం కింద గంజాయి కలిగి ఉండటం నేరం. అయితే తక్కువ మొత్తం కావడంతో ఆయనను ఇంటరాగేట్ చేసి బెయిల్ బాండ్‌పై విడుదల చేశాం. సోషల్ మీడియాలో ఆయన ఏదో పోస్ట్ చేశారని, ఆయన సూసైట్ చేసుకోవాలనుకుంటున్నారని బాబా అనుచరులు మాకు సమాచారం ఇచ్చారు. అవసరమైతే ఆయనను పిలిపించి తదుపరి విచారణ జరుపుతాం" అని ఎస్‌హెచ్ఓ తెలిపారు.
ఇవి కూడా చదవండి
MK Stalin: కొత్త దంపతులు వెంటనే పిల్లల్ని కనండి
Mamata Banerjee: డూప్లికేట్ ఎపిక్ నంబర్లు ఉంటే.. నకిలీ ఓటర్లు ఉన్నట్లు కాదు!
Raksha Khadse: కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే కుమార్తెకు పోకిరీల వేధింపులు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.