Share News

Alaska airport detention: నేరమేమిటో చెప్పకుండానే నిర్బంధం

ABN , Publish Date - Apr 09 , 2025 | 03:22 AM

భారత మహిళ శ్రుతి చతుర్వేదిని అమెరికాలోని అలస్కా విమానాశ్రయంలో 8 గంటల పాటు కారణం లేకుండా నిర్బంధించారు. తన స్నేహితురాలి బ్యాగులో పవర్‌ బ్యాంక్‌ ఉన్న కారణంగా ఇద్దరినీ విచారణ పేరుతో గదుల్లో ఉంచి విమానాలు మిస్‌ అయ్యేలా చేశారు.

Alaska airport detention: నేరమేమిటో చెప్పకుండానే నిర్బంధం

అమెరికాలో భారత మహిళ ఆవేదన

లగేజీలో పవర్‌ బ్యాంకు ఉండడంతో అనుమానించిన అధికారులు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8: చేసిన నేరమేమిటో చెప్పకుండానే అమెరికాలోని అలస్కా విమానాశ్రయంలో 8 గంటల పాటు నిర్బంధించారని భారత మహిళ ఒకరు వాపోయారు. ఇన్‌ఫ్లుయెన్సర్‌, చాయ్‌పానీ వ్యవస్థాపకురాలు శ్రుతి చతుర్వేది ఈ ఆరోపణ చేశారు. ఆదివారం ఆమె తన స్నేహితురాలు శిల్పతో కలిసి విమానాశ్రయానికి వెళ్లారు. ఇద్దరు వేరువేరు విమానాల్లో బయలుదేరాల్సి ఉంది. తొలుత శిల్ప లగేజీని అక్కడి అధికారులు తనిఖీ చేశారు. ఆమె బ్యాగులో పవర్‌ బ్యాంకు ఉండడంతో దాన్ని అనుమానించారు. ఆమెను ఒక గదిలో నిర్బంధించారు. దీంతో ఆమె శ్రుతికి మెసేజ్‌ పెట్టింది. అనంతరం శిల్ప ఫోన్‌ స్విచ్చాఫ్‌ అయింది. ఆందోళన చెందిన శ్రుతి అక్కడి పోలీసులను కలిసి సంప్రదించింది. శిల్ప స్నేహితురాలినని చెప్పడంతో ఆమెను కూడా వేరే గదిలో నిర్బంధించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. పురుష అధికారులే ఆమెను తనిఖీ చేశారు. ఈ కారణంగా వెళ్లవలసిన విమానాలు తప్పిపోయాయి. అనంతరం భారత్‌ చేరుకున్న ఆమె దీనిపై ఎక్స్‌లో పోస్టు పెట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం

ఉదయం ఎండ .. సాయంత్రం వాన

నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ లైన్లు

Updated Date - Apr 09 , 2025 | 03:22 AM