Share News

New Delhi: విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ టెర్మినల్‌లోకి నో ఎంట్రీ

ABN , Publish Date - Apr 14 , 2025 | 04:13 PM

New Delhi: దేశ రాజధాని న్యూఢిల్లీలో నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే విమాన ప్రయాణికులకు ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ బిగ్ అలర్ట్ ప్రకటించింది. విమానాశ్రయంలోని టెర్మినల్ 2ను మరమ్మతులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ టెర్మినల్ నుంచి విమాన సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తారని సదరు ఎయిర్ లైన్స్ వెల్లడించింది.

New Delhi: విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ టెర్మినల్‌లోకి నో ఎంట్రీ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ 2కు మరమ్మతులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రయాణికులకు ఇండిగో ఎయిర్ లైన్స్ సోమవారం కీలక సూచన చేసింది. ఈ టెర్మినల్ మరమ్మతు పనులు ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని పేర్కొంది. దీంతో ఈ విమానాశ్రయం ద్వారా వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు.. టెర్మినల్ 1, 3లను వినియోగించుకోవాలని తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. మళ్లీ ఈ టెర్మినల్ మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు ఈ రెండు టెర్మినల్స్ ద్వారానే ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లవలసి ఉందని ఆ సంస్థ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. మళ్లీ టెర్మినల్ 2ను ఎప్పటి నుంచి వినియోగించుకోనే విషయాన్ని తెలియజేస్తామని ఇండిగో వెల్లడించింది. అయితే ఇండిగోనే కాకుండా.. దాదాపుగా అన్ని విమానాలు.. టెర్మినల్ 1 లేదా 3 నుంచి మాత్రమే వస్తాయని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

UPI Transactions: ఫోన్‌పే, గూగుల్‌పే చేస్తున్నారా ఈ 12 అంకెల యూటీఆర్ చరిత్ర తెలుసా

For National News And Telugu News

Updated Date - Apr 14 , 2025 | 04:26 PM