IPS: పది మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
ABN, Publish Date - Mar 26 , 2025 | 11:21 AM
రాష్ట్రంలో పది మంది ఐపీఎస్ అధికారులు బదిలీ చేస్తూ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి ధీరజ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎస్ అధికారుల బదిలీలుంటాయని ఇటీవల ఉహాగానాలొచ్చాయి. అయితే.. మొత్తం పది మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా పది మంది ఐపీఎస్(IPS) అధికారులను బదిలీ చేశారు. రామనాథపురం రేంజ్ డీఐజీ డా.అభినవ్‌కుమార్ మదురై రేంజ్ డీఐజీగాను, తిరునల్వేలి రేంజ్ డీఐజీ డా.పా.మూర్తి రామరాథపురం రేంజ్ డీఐజీగా బదిలీ అయ్యారు. తిరునల్వేలి సిటీ కమిషనర్ డా.సంతోష్ హదిమాని తిరునల్వేలి రేంజ్ డీఐజీగా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. గ్రేటర్ చెన్నై పరిధిలోని వాషర్‌మెన్‌పేట డిప్యూటీ కమిషనర్ ఆర్. శక్తివేల్ గ్రేటర్ చెన్నై ఇంటెలిజెన్స్ విభాగం-1 డిప్యూటీ కమిషనర్‌గాను, చెన్నై ఈస్ట్ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ డా.వి.భాస్కరన్ వాషర్‌మెన్‌పేట డిప్యూటీ కమిషనర్‌గాను,
ఈ వార్తను కూడా చదవండి: Betting Case: బెట్టింగ్ యాప్ కేసు.. మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు
చెన్నై వెల్ఫేర్ అండ్ ఎస్టేట్ డిప్యూటీ కమిషనర్ ఎస్. మేఘలీనా ఐడెన్ చెన్నై ఈస్ట్ డిప్యూటీ కమిషనర్‌గాను, మైలాపూర్ డిప్యూటీ కమిషనర్ డీఎన్ హరికిరణ్‌ప్రసాద్ చెన్నై వెల్ఫేర్ అండ్ ఎస్టేట్ డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. అలాగే, తమిళనాడు స్పెషల్ పోలీసు ఎస్పీ వి.కార్తీక్ మైలాపూర్ డిప్యూటీ కమిషనర్‌గాను, ఈరోడ్ ఎస్పీ జి.జవహర్ చెన్నై సీబీసీఐడీ ఎస్పీగాను, తిరుప్పూర్ నార్త్ డిప్యూటీ కమిషనర్ ఎ.సుజాత ఈరోడ్ ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి ధీరజ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మీ మనసు బాధపడితే ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటా..
మిస్ వరల్డ్ పోటీలకు 54 కోట్ల ఖర్చు తప్పుకానప్పుడు ఫార్ములా-ఈ తప్పుకాదు
డ్రగ్స్ నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం
Read Latest Telangana News and National News
Updated Date - Mar 26 , 2025 | 11:21 AM