ISRO: ఇస్రో కోసం స్వదేశీ 32-బిట్ మైక్రోప్రాసెసర్లు
ABN , Publish Date - Mar 17 , 2025 | 05:22 AM
ఈ మేరకు తొలి ఉత్పత్తులను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్.. ఇస్రో చైర్మన్ వి నారాయణన్‌కు అందజేశారు. విక్రమ్ 3201ను లాంచ్ వెహికిల్స్ కోసం స్వదేశీయంగా తయారు చేశారు.

బెంగళూరు, మార్చి 16: ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, చండీగఢ్‌లోని సెమీకండక్టర్ లేబొరేటరీ (ఎస్‌సీఎల్) సంయుక్తంగా స్పేస్ అప్లికేషన్ల కోసం విక్రమ్ 3201, కల్పన 3201 అనే 32-బిట్ మైక్రోప్రాసెసర్లను అభివృద్ధి చేశాయి. ఈ మేరకు తొలి ఉత్పత్తులను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్.. ఇస్రో చైర్మన్ వి నారాయణన్‌కు అందజేశారు. విక్రమ్ 3201ను లాంచ్ వెహికిల్స్ కోసం స్వదేశీయంగా తయారు చేశారు. ఇది కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనైనా ఉపయోగించడానికి అర్హత సాధించిన మొట్టమొదటి భారతీయ తయారీ 32 బిట్ మైక్రోప్రాసెసర్.
ఇవి కూడా చదవండి..