Nikhil: చాలప్ప చాలు.. కాంగ్రెస్ పాలన..
ABN , Publish Date - Apr 10 , 2025 | 01:57 PM
జేడీఎస్ యువనేత నిఖిల్ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రికి హనీట్రాప్... ప్రజలకు పన్నుల ట్రాప్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ‘చాలప్ప చాలు.. కాంగ్రెస్ పాలన’ అంటూ.. నిఖిల్ వ్యాఖ్యానించారు.

- మంత్రికి హనీట్రాప్.. ప్రజలకు పన్నుల ట్రాప్
- మండిపడ్డ జేడీఎస్ నేత నిఖిల్
బెంగళూరు: రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని జేడీఎస్ యువనేత నిఖిల్ కుమారస్వామి(Nikhil Kumaraswamy) మండిపడ్డారు. రాష్ట్రంలో పాలనపై ఆయన వ్యంగ్యం చేశారు. మంత్రికి హనీట్రాప్, రాష్ట్ర ప్రజలకు పన్నుల ట్రాప్ సాగుతోందని విరుచుకుపడ్డారు. బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలు అవినీతిపై జేడీఎస్ ఆధ్వర్యంలో ‘సాకప్ప సాకు! కాంగ్రెస్ సర్కార’ (చాలప్ప చాలు కాంగ్రెస్ పాలన) పేరిట నిరసన చేపట్టదలిచామన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Rains: నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలపై భారం మోపుతూనే ఉన్నారన్నారు. శనివారం ఫ్రీడంపార్కులో కేంద్రమంత్రి కుమారస్వామి(Union Minister Kumaraswamy) నేతృత్వంలో ఆందోళన చేపట్టదలిచామన్నారు. రాష్ట్రప్రజలు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Greenfield Expressway: హైదరాబాద్-అమరావతి.. గ్రీన్‌ఫీల్డ్ హైవే
CM Revanth Reddy: బ్రిటిష్ వారి కంటే బీజేపీ నేతలు ప్రమాదకారులు
Hyderabad: ఫోన్‌లో మాట్లాడవద్దన్నందుకు.. ఆ బాలిక ఏం చేసిందో తెలిస్తే..
Read Latest Telangana News and National News