Share News

23rd Law Commission Chairman: లా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి

ABN , Publish Date - Apr 14 , 2025 | 04:54 AM

సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి లా కమిషన్‌ 23వ చైర్‌పర్సన్‌గా నియమితులవుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ వారంలోనే నోటిఫికేషన్‌ విడుదలవుతుందని అంచనా

23rd Law Commission Chairman: లా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి

  • ఈ వారంలోనే నోటిఫికేషన్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13: లా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి నియమితులయ్యే అవకాశం ఉందని ఆదివారం విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 23వ లా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా ఆయనను నియమిస్తూ ఈ వారంలోనే నోటిఫికేషన్‌ రావచ్చని పేర్కొన్నాయి. 23వ లా కమిషన్‌ను గత ఏడాది సెప్టెంబరు రెండో తేదీన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాని కాలపరిమితి మూడేళ్లని పేర్కొంది. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయవచ్చా, లేదా అన్న విషయాన్ని అధ్యయనం చేసే బాఽధ్యతను కూడా ఈ కమిషన్‌కు అప్పగించింది. జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి తొలుత 2004లో రాజస్థాన్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి 2023 మే 14న పదవీ విరమణ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Capital Amaravati: మరో 30 వేల ఎకరాల భూ సమీకరణకు రంగం సిద్ధం

IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ

AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..

TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

For National News And Telugu News

Updated Date - Apr 14 , 2025 | 04:54 AM