ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kangana Ranaut: ఎమర్జెన్సీ సినిమా చూసేందుకు ప్రియాంకకు ఆహ్వానం

ABN, Publish Date - Jan 08 , 2025 | 06:54 PM

ఎమర్జెన్సీ చిత్రం ఒక వ్యక్తిత్వానికి సంబంధించిన సున్నితమైన చిత్రణ అని తాను భావిస్తు్న్నానని, ఎంతో హుందాగా ఇందిరాగాంధీ పాత్రను చిత్రీకరించామని కంగన రనౌత్ తెలిపారు.

ముంబై: భారతదేశ తొలి మహిళా ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జీవిత కథతో రూపొందించిన హిందీ చిత్రం 'ఎమర్జెన్సీ' (Emergency). నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వయంగా ఇందిరాగాంధీ (Indira Gandhi)పాత్రలో నటించి, దర్శకత్వం హహించారు. మహిచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం ఎంపీ అయిన కంగనా రనౌత్ ఈ చిత్రాన్ని వీక్షించేందుకు వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ, ఇందిరాగాంధీ మనుమరాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)ని ఆహ్వానించారు. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో కంగన తెలిపారు.

Danish Ali: మన్మోహన్‌కు అవమానం.. ప్రణబ్‌కు గిఫ్ట్


''నేను పార్లమెంటులో ప్రియాంక గాంధీని కలిశాను. మీరు ఎమర్జెన్సీ సినిమా చూడాలని చెప్పాను. ప్రియాంక ఎంతో హుందాగా స్పందించారు. సినిమా చూస్తానని నాతో అన్నారు'' అని కంగన తెలిపారు. ఎమర్జెన్సీ చిత్రం ఒక వ్యక్తిత్వానికి సంబంధించిన సున్నితమైన చిత్రణ అని తాను భావిస్తు్న్నానని, ఎంతో హుందాగా ఇందిరాగాంధీ పాత్రను చిత్రీకరించామని కంగన అన్నారు. పరిశోధనా క్రమంలో ఇందిర వ్యక్తిగత జీవితం గురించి చాలా విషయాలు తెలిసాయని అన్నారు. సహజంగా మగవారితో పోలిస్తే మహిళలను తగ్గించి చూస్తుంటారని, అయితే ఇందిరాగాంధీ జీవితంలో సంచలనాత్మక ఎన్‌కౌంటర్లు ఉన్నాయని చెప్పారు. చాలా గౌరవంగా, ఎంతో సెన్సిటివిటీతో ఆ పాత్రను చిత్రీకరించామని తెలిపారు. రాజకీయ నాయకురాలిగా ఇందిరాగాంధీకు మాస్ అప్పీల్ ఉండేదని ప్రశంసించారు. ఎమర్జెన్సీ సమయంలో కొన్ని అసాధారణ విషయాలను మాత్రమే కాకుండా ఇందిర ప్రేమించే చాలా విషయాలను తెరపై చూపించామని, దేశానికి మూడుసార్లు ప్రధానమంత్రి కావడం సాధారణ విషయం కాదని, ఇందిరని ప్రజలు ప్రేమించారని చెప్పారు.


ఎమర్జెన్సీ చిత్రం పలు ఆటంకాలను అధిగమించి జనవరి 17న విడుదలకు సిద్ధమవుతోంది. కంగనతో పాటు ఈ చిత్రంలో అటల్ బిహారీ వాజ్‌పేయిగా శ్రేయాస్ తల్పడే, ఫీల్డ్ మార్షల్ మనెక్‌షాగా మిలంద్ సోమన్, పుపుల్ జయకర్‌గా మహిమా చౌదరి, జగ్జీవన్ రామ్‌గా సతీష్ కౌశిక్, జయప్రకాష్ నారాయణ్‌గా అనుపమ్ ఖేర్ తదితరులు నటించారు.


ఇవి కూడా చదవండి..

Supreme Court: సమాచార కమిషన్‌ పదవులను తక్షణమే భర్తీ చేయండి

ఎక్కడ దాక్కున్నా పట్టిచ్చే ‘భారత్‌ పోల్‌’

Read Latest National News and Telugu News

Updated Date - Jan 08 , 2025 | 06:54 PM