Karnataka Home Minister Parameshwar: మహా నగరాల్లో ఇలాంటివి మామూలే

ABN, Publish Date - Apr 08 , 2025 | 05:19 AM

బెంగళూరులో మహిళలపై లైంగిక దాడులపై హోం మంత్రి పరమేశ్వర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన “మహా నగరాల్లో ఇలాంటి ఘటనలు సాధారణమే” అని చెప్పారు, దీని పై బీజేపీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది

Karnataka Home Minister Parameshwar: మహా నగరాల్లో ఇలాంటివి మామూలే
  • మహిళలపై దాడుల పట్ల కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర్‌

బెంగళూరు, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): బెంగళూరు నగరంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై హోం మంత్రి పరమేశ్వర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అర్ధరాత్రి నడిచి వెళుతున్న అన్నాచెల్లెలిపై దాడి, ఆపై సోదరిపై అత్యాచారం, సుద్దగుంటపాళ్యలో నడిచి వెళుతున్న ఇద్దరు యువతుల పట్ల ఆకతాయి అసభ్య ప్రవర్తన గురించి మీడియా ప్రశ్నించగా.. బెంగళూరు వంటి మహా నగరాల్లో ఇలాంటి ఘటనలు సాధారణమని హోం మంత్రి అన్నారు. నగరంలో గస్తీ పెంచాల్సిందిగా పోలీసులను ఆదేశించినట్టు తెలిపారు. ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున సుద్దగుంటపాళ్య పరిధిలోని భారతి లే అవుట్‌లో ఇద్దరు యువతులు నడిచి వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఒక్కసారిగా యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించాడని, ఈ సంఘటన సీసీ కెమెరాలో రికార్డు అయిందని ఆయన అన్నారు. బాధితురాలు ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. మరోవైపు.. పరమేశ్వర్‌ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఇది జరిగిన ఘటనను చిన్నదిగా చూపించే ప్రయత్నమని ఆ పార్టీ నేత షెహజాద్‌ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Indigo flight: గాలిలో ఉండగానే మహిళ మృతి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Mary Kom: 20 ఏళ్ల బంధానికి ముగింపు.. విడాకులు తీసుకోబోతున్న మేరీ కోమ్

Waqf Act in Supreme Court: వక్ఫ్ చట్టంపై సుప్రీం విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం

For National News And Telugu News

Updated Date - Apr 08 , 2025 | 05:20 AM