Kathak Legend Breathes Her Last: ప్రముఖ కథక్ కళాకారిణి కుముదిని కన్నుమూత
ABN , Publish Date - Apr 13 , 2025 | 03:49 AM
ప్రముఖ కథక్ నృత్య కళాకారిణి కుముదిని లాఖియా (95) వృద్ధాప్య కారణాల వల్ల అహ్మదాబాద్‌లో మృతి చెందారు. ఆమె పద్మవిభూషణ్‌తో పాటు అనేక పురస్కారాలు పొందారు

అహ్మదాబాద్, ఏప్రిల్ 12: ప్రముఖ కథక్ నృత్య కళాకారిణి కుముదిని లాఖియా శనివారం అస్తమించారు. ఆమె వయసు 95 ఏళ్లు. వృద్ధాప్య సమస్యల కారణంగా అహ్మదాబాద్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవంలో ఆమె పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా కూడా పనిచేశారు. 1981లో విడుదలైన హిందీ చిత్రం ఉమ్రావ్‌జాన్‌కు నృత్యదర్శకత్వం వహించారు. 1930 మే 17న అహ్మదాబాద్‌లో జన్మించిన ఆమె భారతీయ కళా కేంద్రలో శంభు మహరాజ్ వద్ద శిక్షణ పొందారు. 1964లో ఇక్కడ కదంబ్ సెంటర్ ఫర్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఏర్పాటు చేశారు. కథక్ నృత్య రీతుల్లో వినూత్న ప్రక్రియలను ఆవిష్కరించారు. పద్మశ్రీ, పద్మభూషణ్, సంగీత నాటక అకాడమీ సహా ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఆమె మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Kollu Ravindra: కులాలు, మతాల మధ్య చిచ్చుపెడితే.. మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్..
South Central Railway: గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు..