Share News

Congress: కేరళ కాంగ్రెస్‌ నేతల భేటీకి థరూర్‌

ABN , Publish Date - Mar 01 , 2025 | 06:00 AM

కేరళలో కాంగ్రెస్‌ నేతలంతా కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి తోడ్పడాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు.

Congress: కేరళ కాంగ్రెస్‌ నేతల భేటీకి థరూర్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): కేరళలో కాంగ్రెస్‌ నేతలంతా కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి తోడ్పడాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు. శుక్రవారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీలతో పాటు కేరళ సీనియర్‌ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి శశి థరూర్‌ కూడా హాజరయ్యారు. థరూర్‌ కాంగ్రె్‌సను వీడుతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకొంది. కాగా, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా బహిరంగ ప్రకటనలు చేయరాదని ఖర్గే ఈ సందర్భంగా పరోక్షంగా శశిథరూర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Updated Date - Mar 01 , 2025 | 06:00 AM