Indian Deportees: పద్ధతి మార్చుకోని యూఎస్.. కాళ్లకు, చేతులకు బేడీలు

ABN, Publish Date - Feb 16 , 2025 | 04:31 PM

Indian Deportees: ; ప్రధాని మోదీ.. తన యూఎస్ పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశమైనా.. మరోవైపు తమ దేశంలో అక్రమ వలసదారులను.. స్వదేశానికి పంపే క్రమంలో అమెరికా వ్యవహరిస్తున్న తీరు పలు విమర్శలుకు దారి తీసుస్తోంది.

Indian Deportees: పద్ధతి మార్చుకోని యూఎస్.. కాళ్లకు, చేతులకు బేడీలు
Indian deportees

పంజాబ్, ఫిబ్రవరి 16: తమ దేశంలోని అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపే క్రమంలో అమెరికా తన పద్ధతిని ఏ మాత్రం మార్చుకోవడం లేదు. శనివారం రాత్రి అంటే.. ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి మరో విమానం యూఎస్ నుంచి భారత్‌లోని అమృత్ సర్ చేరుకుంది. యూఎస్ మిలటరీకి చెందిన విమానంలో 116 మంది అక్రమ వలసదారులను స్వదేశానికి పంపింది. వారందరి కాళ్లకు చైనుతోపాటు చేతులకు బేడీలు వేసి పంపింది. అయితే ఈ ప్రయాణం సాగినంత సేపు.. తమను ఇలా బందీల్లా తీసుకు వచ్చారని పంజాబ్‌, హోషియార్‌పూర్ జిల్లాలోని కుర్లా కలాన్‌ గ్రామానికి చెందిన దల్జీత్ సింగ్.. వాపోయారు.

దాదాపు అర గంట ఆలస్యంగా.. అంటే శనివారం అర్థరాత్రి 11.35 గంటలకు సీ 17 మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ అమృత్‌సర్ విమానాశ్రయం చేరుకుందని తెలిపారు. తన గ్రామానికిగా చెందిన వ్యక్తి ట్రావెల్ ఏజెంట్‌కు పరిచయం చేశాడని.. అతడి ద్వారా తాను అక్రమ మార్గంలో యూఎస్ చేరుకున్నానని వివరించారు. తన భర్తను ట్రావెల్ ఏజెన్సీ మోసగించిందంటూ దల్జీత్ సింగ్ భార్య ఆవేదన వ్యక్తం చేశారు.


ఇక 116 మందిలో 65 మంది పంజాబ్, 33 మంది హర్యానా, 8 మంది గుజరాత్‌తోపాటు ఉత్తరప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్‌కు చెందిన వారు ఇద్దరిద్దరు ఉన్నారని ఉన్నతాధికారులు చెప్పారు. వీరిలో అత్యధికులు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వారేనని వివరించారు.

Also Read : సీఎం రేవంత్‌కి బీజేపీ ఎంపీ సవాల్


మరోవైపు యూఎస్‌ నుంచి అమృత్‌సర్ చేరుకున్న ఈ అక్రమ వలసదారులను స్వస్థలాలకు చేర్చేందుకు పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. ఇక మరో విమానం ఆదివారం యూఎస్ నుంచి అమృత్‌సర్ చేరుకొంటుందని తెలుస్తోంది. అయితే ఈ విమానం ఎప్పుడు.. చేరుకుంటుందనే అంశంపై స్పష్టమైన సమాచారం మాత్రం లేదని ఉన్నతాధికారులు వివరించారు.


ఇంకోవైపు ఫిబ్రవరి 5వ తేదీన యూఎస్ నుంచి 104 మంది అక్రమ వలసదారులను తీసుకుని ఓ యుద్ధ విమానం అమృత్‌సర్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ విమానంలో సైతం వారి చేతులకు బేడీలు వేసి తీసుకు వచ్చారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.


ఈ నేపథ్యంలో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పార్లమెంట్ సాక్షిగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. అలాగే ప్రధాని మోదీ సైతం ప్రస్తుతం యూఎస్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి వేళ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంపై కేంద్రంపై రాజకీయ పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.

For National News And Telugu News

Updated Date - Feb 16 , 2025 | 04:49 PM