Mahakumbh 2025: త్రివేణి సంగమంలో స్నానం చేసిన రాజ్‌నాథ్ సింగ్
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:56 PM
మహాకుంభోత్సవం పాల్గొనడం భగవంతుడు తనకు ఇచ్చిన అవకాశం భావిస్తున్నట్టు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆయన వెంట బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది, పలువురుపార్టీ నేతలు మహాకుంభ్‌లో పాల్గొన్నారు.

ప్రయాగ్‌రాజ్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న 'మహాకుంభ్ మేళా 2025' (Mahakumbh 2025)లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) శనివారంనాడు పాల్గొన్నారు. గంగ, యుమున, సరస్వతీ నదుల సంగమమైన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. గంగా హారతిలో పాల్గొన్నారు. గత ఆరు రోజులుగా జరుగుతున్న ఈ మహోత్సవంలో ఇంతవరకూ దేశ, విదేశాలకు చెందిన 7.3 కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు.
Kumbh Mela: ఫిబ్రవరి 15న సికింద్రాబాద్ నుంచి కుంభమేళాకు ప్రత్యేక రైలు!
భగవంతుడు ఇచ్చిన అవకాశం
మహాకుంభోత్సవం పాల్గొనడం భగవంతుడు తనకు ఇచ్చిన అవకాశం భావిస్తున్నట్టు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ''భగవంతుడు నాకీ మహదవకాశం ఇచ్చారు. ఈరోజు సంగమంలో స్నానం చేశాను. జీవితం ధన్యమైందని అనిపించింది. సనానత ధర్మ ఆధ్యాత్మిక అనుభవానికి, భారతీయ సంస్కృతికి ప్రతీక ఈ ఉత్సవం. సామాజిక సామరస్యత, సనాతన ధర్మ ఆధ్యాత్మికత, శాస్త్రీయతలను గంగా, యమునా, సరస్వతి సంగమం చాటుచెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా విశేషంగా పాల్గొంటున్న ఈ అతిపెద్ద ఉత్సవాన్ని సమర్ధవంతంగా నిర్వహిస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను అభినందించి తీరాలి. ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు'' అని ఆయన చెప్పారు.
రాజ్‌నాథ్ సింగ్ వెంట బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది, పలువురుపార్టీ నేతలు మహాకుంభ్‌లో పాల్గొన్నారు. ఈ మహోత్సవాలకు 45 కోట్ల మంది వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనాగా ఉంది. తొల రెండు రోజుల్లో 5.20 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేశారు.
ఇవి కూడా చదవండి..
Hero Vijay: తేల్చి చెప్పేసిన హీరో విజయ్.. విషయం ఏంటంటే..
Karnataka: కర్ణాటకలో పట్టపగలే బ్యాంకు దోపిడీ
Read Latest National News and Telugu News