Delhi Election Results: షీష్ మహల్ టూ లిక్కర్ కేస్.. ఆప్ ఓటమికి ప్రధాన కారణాలు

ABN, Publish Date - Feb 08 , 2025 | 01:50 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఘోర ఓటమి దిశగా దూసుకెళ్తుంది. దీనిని విశ్లేషిస్తే ఆప్ ఓటమికి గల కారణాలు చాలా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటమికి గల ప్రధాన కారణాలు ఏంటనేది ఇక్కడ తెలుసుకుందాం.

Delhi Election Results: షీష్ మహల్ టూ లిక్కర్ కేస్.. ఆప్ ఓటమికి ప్రధాన కారణాలు
Delhi Election Results 2025

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర ఓటమి దిశగా కొనసాగుతోంది. ఈ క్రమంలో చాలా మంది నిపుణులను ఈ ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అయితే ఈ ఓటమి వెనుక ముఖ్యంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు, ఆయన నిర్ణయాలతోపాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.


సామాన్యుడి మాదిరిగా..

ఆప్ ప్రజలలో మొదట సామాన్యుల పార్టీగా వెలుగులోకి వచ్చింది. ఆ క్రమంలో కేజ్రీవాల్ తన రాజకీయ జీవితాన్ని 'ఆమ్ ఆద్మీ' నినాదంతో సాధారణ జీవనశైలితో ప్రారంభించారు. కాటన్ చొక్కా, చిన్న ఫ్లాట్, చౌకైన కారులో ప్రయాణం సాగించారు. దీంతో ఆయన క్రమంగా ప్రజల్లో ఆదరణ దక్కించుకున్నారు. కానీ కేజ్రీవాల్ ప్రయాణం క్రమంగా మారిపోయింది. 40 కోట్ల రూపాయల విలాసవంతమైన షీష్ మహల్ నిర్మాణం సహా అనేక అంశాలు ఆయనపై ఓటర్లలో నిరాశను పెంచాయని చెప్పవచ్చు. ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్య ప్రజల కోసం పనిచేయాలని ఆశించారు. కానీ భారీ వృథా వ్యయం కాస్తా, విరుద్ధంగా మారిపోయింది.


లిక్కర్ స్కాం కేసు

కేజ్రీవాల్ ప్రారంభంలో అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తారు. కానీ లిక్కర్ స్కాం కేసు విషయంలో ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. ఈ కేసు ద్వారా ఆయన మాటలతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ, చేతల్లో మాత్రం వ్యత్యాసం కనిపించింది. మద్యం బాటిళ్లపై 'ఒకటి కొంటే ఒకటి ఉచితం' అనే కొత్త విధానం తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీని మద్యపాన ప్రియుల నగరంగా మారుస్తోందన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రజల్లో క్రమంగా పార్టీపై నమ్మకం తగ్గిపోయింది.


యమునా నది

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అరవింద్ కేజ్రీవాల్ చేసిన యమునా కాలుష్యం హామీ కూడా దెబ్బతీసిందని చెప్పవచ్చు. యమునా నదిని శుభ్రపరుస్తానని ఆయన పదే పదే హామీ ఇచ్చినప్పటికీ, నది మాత్రం కలుషితంగానే ఉంది. ఆప్ 2015 మ్యానిఫెస్టోలో ఈ నదిని 100% శుభ్రపరుస్తామని హామీ ఇచ్చారు, కానీ అది నెరవేరలేదు.

తప్పుడు వాగ్దానాలు

కేజ్రీవాల్ అనేక వాగ్దానాలు చేశారు. కానీ వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారు. ఇవి ఓటర్లలో ఆయన విశ్వసనీయతను దెబ్బతీశాయి. 2013లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఆప్ తొలిసారి ఆవిర్భవించినప్పుడు కీలక వాగ్దానాలను చేసింది. కానీ కొన్ని ఉచితాలు తప్ప మిగతావి అమలు కాలేదు. నీటి కనెక్షన్లు, వాయు కాలుష్యాన్ని తగ్గించడం వంటి అనేక ఇతర వాగ్దానాలు నెరవేరలేదు. ఉపాధి బడ్జెట్ 2023 కూడా ఉద్యోగ సృష్టికి సంబంధించిన వాగ్దానాలను నెరవేర్చడంలో ఆప్ విఫలమైంది.


అనేక వివాదాలు..

గోవా, గుజరాత్ ఎన్నికల్లో కేజ్రీవాల్ డబ్బు ఖర్చు ఆరోపణలపై ఆయనిచ్చిన సమాధానాలు కూడా ఓటర్లలో ప్రశ్నలు సృష్టించాయి. భవిష్యత్తులో ఈ వివాదాలు కేజ్రీవాల్ నాయకత్వానికి మరింత దెబ్బతీయగలవని ఆందోళనలు వచ్చాయి. ఇని కూడా ఓటర్లలో క్రమంగా మార్పుకు కారణమయ్యాయని చెప్పవచ్చు.

వ్యతిరేక భావన

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ రావడానికి ప్రభుత్వ వ్యతిరేకత కూడా కీలక పాత్ర పోషించింది. 2015 నుంచి 2020 వరకు ఢిల్లీలో ఆప్ గణనీయమైన విజయాలు సాధించినప్పటికీ, దీని మొదటి రెండు పదవీకాలాల సమయంలో ఆరోగ్యం, విద్య వంటి రంగాలలో మాత్రమే పనితీరును కనబరిచారు. ఆ క్రమంలో మెరుగైన గాలి నాణ్యతతో సహా నెరవేరని అనేక వాగ్దానాలు ఢిల్లీ ఓటర్లను ఇబ్బంది పెట్టాయి. దీంతో గత 10 సంవత్సరాల ఆప్ పాలనలో ఓటర్లు అనేక ఆరోపణలను సాకులుగా చూశారు. దీంతో ఈసారి బీజేపీ వాగ్దానాలపై ఓటర్లు మక్కువ చూపించారు.


ఇవి కూడా చదవండి:

Omar Abdullah: ఇంకా బాగా కొట్టుకోండి.. ఇండియా కూటమిపై ఒమర్ అబ్దుల్లా ట్వీట్


AAP vs BJP: ఆప్ నాలుగోసారి గెలుస్తుందా లేదా బీజేపీ కైవసం చేసుకుంటుందా..


Delhi Election Results 2025: నేటి ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఫస్ట్ ప్రకటించేది ఇక్కడే.. చివరగా..


Gold and Silver Rates Today: పైపైకి పసిడి, వెండి రేట్లు.. ఎంతకు చేరాయంటే..

8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 08 , 2025 | 01:50 PM