TMC: టీఎంసీ ఎంపీల మధ్య విభేదాలు.. మహువా మొయిత్రాకి మమత వార్నింగ్
ABN , Publish Date - Apr 08 , 2025 | 07:35 PM
ఫ్లోర్ టైమ్ బాధ్యత కలిగిన కల్యాణ్ బెనర్జీ లోక్‌సభలో తనకు మాట్లాడేందుకు తగిన సమయం కేటాయించడం లేదని మెుయిత్రా అసంతృప్తితో ఉన్నారు. పలు అంశాలపై మాట్లాడేందుకు మెుయిత్రా ముందుకు వచ్చినా కల్యాణ్ నిరాకరించినట్టు చెబుతున్నారు.

న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కడాన్ని ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)సీరియస్‌గా తీసుకున్నారు. పార్టీ ఎంపీలు ఘర్షణ పడుతున్న వీడియోలు లీక్ కావడం, వాటిని బీజేపీ ఐటీ సెల్ ఇన్‌చార్జి అమిత్ మాలవీయ షేర్ చేయడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పార్టీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra)కు మమతా బెనర్జీ తీవ్ర హెచ్చరికలు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే ధోరణిలో వ్యవహరిస్తూ పోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడేది లేదని మెయిత్రాను హెచ్చరించినట్టు చెబుతున్నారు.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఎంపీలు మహువా మొయిత్రాకి, కల్యాణ్ బెనర్జీకి మధ్య మాటామాట పెరిగి గొడవ చోటుచేసుకున్న విషయాన్ని ఆ పార్టీ సీనియర్ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్.. మమతాబెనర్జీకి వివరించారు. దీంతో మమత తన హెచ్చరిక సందేశాన్ని రాజ్యసభ మహిళా ఎంపీ ద్వారా మహువా మొయిత్రాకు పంపారు. ఇదే ప్రవర్తన కొనసాగితే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని, పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు కూడా వెనుకాడేది లేదని మెయిత్రాను మమత హెచ్చరించారు.
మొయిత్రా వెర్సన్ కల్యాణ్ బెనర్జీ
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మొయిత్రా-కల్యాణ్ బెనర్జీలు ఒకరిపట్ల మరొకరు అసంతృప్తితో ఉన్నారు. ఫ్లోర్ టైమ్ బాధ్యత కలిగిన కల్యాణ్ బెనర్జీ లోక్‌సభలో తనకు మాట్లాడేందుకు తగిన సమయం కేటాయించడం లేదని మెుయిత్రా అసంతృప్తితో ఉన్నారు. పలు అంశాలపై మాట్లాడేందుకు మెుయిత్రా ముందుకు వచ్చినా కల్యాణ్ నిరాకరించినట్టు చెబుతున్నారు. ఇటు పార్టీలోనూ, మీడియాలోనూ కల్యాణ్ బెనర్జీ ప్రాధాన్యత పెరుగుతుండటంతో మొయిత్రా అభద్రతతో ఉన్నట్టు చెబుతున్నారు.
గొడవ ఎక్కడ జరిగిందంటే..
కాగా, తాజా గొడవ ఏప్రిల్ 4న ఈసీ కార్యాలయం వద్ద జరిగింది. ఒక ప్రజంటేషన్‌ను సమర్పించేందుకు టీఎంసీ ప్రతినిధుల బృందం ఈసీ కార్యాలయానికి వెళ్లింది. అంతకుముందు వినతిపత్రంపై సంతకాలు చేసేందుకు సమావేశం కావాలని ఆ పార్టీ ఆదేశాలిచ్చింది. సంతకాల సేకరణ బాధ్యత కల్యాణ్ బెనర్జీకి అప్పగించగా, ఆయను సుప్రీంకోర్టులో పని ఉండటంతో ఆ పని తన సెక్రటరీకి అప్పగించారు. ఉదయం 10 గంటలకు సమావేశం కావాల్సి ఉండగా బెనర్జీ దానికి ముందే తన పని పూర్తికావడంతో నేరుగా ప్రతినిధి బృందంతోనే కలిసేందుకు బయలుదేరారు. ఈసీఐ కార్యాలయానికి ఆయన చేరుకోగానే ఉద్రిక్తత తలెత్తింది. తన సంతకం తీసుకోలేదంటూ మహువా మెయిత్రా ఆయనను నిలదీశారు. కమిషన్‌ను కలిసే ఎంపీల జాబితాలో ఆమె పేరు లేదని బెనర్జీ చెప్పడంతో ఎంపీల మధ్య గొడవ మొదలైందని చెబుతున్నారు. డెరిక్ ఒబ్రెయిన్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని, పోలీసులు జోక్యం చేసుకోవాలని పిలిచే వరకూ వెళ్లిందని ఆ వర్గాల సమాచారం.
ఇవి కూడా చదవండి..
Supreme Court Closes NTA Case: ఎన్‌టీఏపై కేసును మూసివేసిన సుప్రీంకోర్టు
Heavy Rains: ఈరోడ్‌లో వర్షబీభత్సం.. అరటి తోటలు ధ్వంసం
For National News And Telugu News