Share News

Manish Sisodia: సీఎం చేస్తామంటూ బీజేపీ ఆఫర్: సిసోడియా

ABN , Publish Date - Jan 24 , 2025 | 03:18 PM

విపక్ష పార్టీలను చీల్చేందుకు బీజేపీ దగ్గర ఒక మెకానిజం ఉందని, తమ మాటలను నిరాకరించిన వాళ్లను జైళ్లకు పంపుతుందని సిసోడియా అన్నారు. అధికారం కోసం బెదిరింపులు, రాజకీయ అవకతవకలకు పాల్పడటం బీజేపీ చేస్తు్ంటుందని దుయ్యబట్టారు.

Manish Sisodia: సీఎం చేస్తామంటూ బీజేపీ ఆఫర్: సిసోడియా

న్యూఢిల్లీ: బీజేపీపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తీహార్ జైలులో ఉండగా బీజేపీ తనకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసిందని ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో మీడియాకు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు.

Delhi Elections: ఎన్నికలకు మందే కేజ్రీవాల్‌ను చంపేందుకు కుట్ర.. సీఎం సంచలన వ్యాఖ్యలు


''బీజేపీలో చేరి ఆప్ ఎమ్మెల్యేలను విచ్ఛినం చేయండి, మిమ్మల్నే ముఖ్యమంత్రిని చేస్తాం'' అని బీజేపీ ఆఫర్ ఇచ్చిందని, తమ ఆఫర్‌ను కాదంటే సుదీర్ఘకాలం జైలులో మగ్గేలా చేస్తామని బెదిరించిందని సిసోడియా ఆరోపించారు. విపక్ష పార్టీలను చీల్చేందుకు బీజేపీ దగ్గర ఒక మెకానిజం ఉందని, తమ మాటలను నిరాకరించిన వాళ్లను జైళ్లకు పంపుతుందని అన్నారు. అధికారం కోసం బెదిరింపులు, రాజకీయ అవకతవకలకు పాల్పడటం బీజేపీ చేస్తు్ంటుందని దుయ్యబట్టారు. స్కూళ్లు, పాఠశాలలు, నీళ్లు, విద్యుత్ వంటి కనీస ప్రజావసరాలపై బీజేపీకి ఎలాంటి పట్టింపులేదని, ఆ పనే చేసి ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆయా రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించి ఉండేవని చెప్పారు.


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జాంగ్‌పుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మనీష్ సిసోడియా... ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో 2023లో అరెస్టయ్యారు. 17 నెలల పాటు జైలులో ఉన్నారు. 2024 ఆగస్టులో సుప్రీంకోర్టు ఆయకు బెయిలు మంజూరు చేసింది.


ఇవి కూడా చదవండి..

Explosion.. మహారాష్ట్రలో భారీ పేలుడు: ఐదుగురి మృతి..

Governor: అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 24 , 2025 | 03:18 PM