Jammu and Kashmir: బారాముల్లాలో భారీ అగ్నిప్రమాదం..పలు ఇళ్లు ధ్వంసం
ABN, Publish Date - Mar 24 , 2025 | 08:50 PM
మంటలు ఒక్కసారిగా చుట్టుపక్కలకు విస్తరించడం, పెద్ద ఎత్తున పొగలు కమ్ముకోవడంతో జనం భయాందోళనలకు గురయ్యారు. మంటల్లో సుమారు ఏడు ఇళ్లు ధ్వంసమైనట్టు తెలుస్తోంది.

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లోని బారాముల్లా (Baramulla) ఓల్డ్ టౌన్ జలాల్ మొహల్లాలో సోమవారం సాయంత్ర భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు ఒక్కసారిగా చుట్టుపక్కలకు విస్తరించడం, పెద్ద ఎత్తున పొగలు కమ్ముకోవడంతో జనం భయాందోళనలకు గురయ్యారు. మంటల్లో సుమారు ఏడు ఇళ్లు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. తక్షణం అగ్నిమాపక దళాలు, అత్యవసర సర్వీసులు రంగంలోకి దిగాయి.
Nagpur Violence: అల్లర్ల నిందితుల ఇళ్లు కూల్చివేతలపై ముంబై హైకోర్టు స్టే... ఏకపక్ష నిర్ణయంపై ఆగ్రహం
స్థానికులు సహకారంతో జాయింట్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్టు అధికారులు తెలిపారు. మంటలు మరింత విస్తరించకుండా అదుపు చేస్తున్నామని, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. కాగా, ప్రమాదంలో ప్రాణనష్టం కానీ, ప్రమాదానికి కారణాలు కానీ వెంటనే తెలియలేదు.
ఇవి కూడా చదవండి..
Devendra Fadnavis: క్షమాపణ చెప్పాలి.. కునాల్ కమ్రా వ్యాఖ్యలపై ఫడ్నవిస్ ఆగ్రహం
Kunal Kamra Controversy: హాబిటాట్ క్లబ్ ఆక్రమణల తొలగింపు.. రంగంలోకి దిగిన బీఎంసీ
Rajya Sabha : ముస్లిం రిజర్వేషన్ల అంశంపై రాజ్యసభలో రభస
Updated Date - Mar 24 , 2025 | 08:56 PM