Meta: జుకర్‌బర్గ్ వ్యాఖ్యలపై భారత్‌కు క్షమాపణ చెప్పిన మెటా
ABN, Publish Date - Jan 15 , 2025 | 03:54 PM
అధికారంలో ఉన్న చాలా ప్రభుత్వాలు 2024 ఎన్నికల్లో తిరిగి ఎన్నిక కాలేదని జుకర్‌బర్గ్ వ్యక్తం చేసిన అభిప్రాయం చాలా దేశాల విషయంలో నిజమేనని. ఇండియా విషయంలో మాత్రం కాదని మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ శివనాథ్ టుక్‌రాల్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడం, పార్లమెంటరీ కమిటీ ఆయనకు సమన్లు పంపేందుకు సిద్ధపడటంతో 'మెటా ఇండియా' (Meta India) స్పందించింది. భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేసింది. పొరపాటు జరిగిందని వివరణ ఇచ్చింది.
Akhilesh Yadav: కాంగ్రెస్ కంటే ఆప్ బలంగా ఉంది..అందుకే మా మద్దతు
''అధికారంలో ఉన్న చాలా ప్రభుత్వాలు 2024 ఎన్నికల్లో తిరిగి ఎన్నిక కాలేదని జుకర్‌బర్గ్ వ్యక్తం చేసిన అభిప్రాయం చాలా దేశాల విషయంలో నిజమే. ఇండియా విషయంలో మాత్రం కాదు'' అని మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ శివనాథ్ టుక్‌రాల్'' ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. జరిగిన పొరపాటుకు క్షమాపణ తెలియజేసుకుంటున్నామని అన్నారు. మెటాకు భారత్ అతి కీలక భాగస్వామి అని, దేశ సృజనాత్మక భవిష్యత్తులో కీలక తాము కీలక పాత్ర పోషించేందుకు తాము ఎదురుచూస్తున్నామని కూడా పేర్కొన్నారు.
వివాదం ఏమిటంటే..
2024 అతిపెద్ద ఎన్నికల సంవత్సరంగా నిలిచిందని, భారత్ సహా అనేక దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓడిపోయాయని జుకర్‌బర్గ్ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించారు. ఆయా దేశాల్లో ద్రవ్యోల్బణం, కోవిడ్, ఆర్థిక విధానాల ప్రభావం ఇందుకు కారణం కావచ్చని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై తొలుత కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. జుకర్ బర్గ్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. 2024లో నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల్లో 64 కోట్ల మంది పాల్గొన్నారని, నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మూడోసారి విశ్వాసం చాటుకున్నారని తెలిపారు. కోవిడ్ సమయంలో 80 కోట్ల మందికి ఉచిత ఆహారం, 220 కోట్ల వ్యాక్సిన్లు అందించడంతో పాటు ప్రపంచ దేశాలకు భారత్ సాయం చేసిందని, మోదీ నిర్ణయాలు మూడోసారి ఆయన విజయానికి నిదర్శనంగా నిలిచాయని చెప్పారు. అసత్య సమాచారం సరికాదని, వాస్తవాలను గ్రహించి, విశ్వసనీయతను కాపాడుకోవాలని మోటాను ట్యాగ్ చేస్తూ వైష్ణవ్ వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలోనే 18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలను వక్రీకరిస్తూ చేసిన వ్యాఖ్యలపై జుకర్‌బర్గ్‌కు సమన్లు పంపాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిర్ణయించినట్టు బీజేపీ ఎంపీ, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హౌస్ ప్యానెల్ చైర్మన్ డాక్టర్ నిషికాంత్ దూబే ప్రకటించారు. తప్పుడు సమచారం వల్ల ప్రజాస్వామ్య దేశం ప్రతిష్ట దెబ్బతింటుందని, చేసిన తప్పును సరిచేసుకునేందుకు ఇటు పార్లమెంటుకు, అటు ప్రజలకు మోటా సంస్థ క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈ క్రమంలోనే మోటా స్పందిస్తూ భారత్‌కు క్షమాపణలు చెప్పింది.
ఇవి కూడా చదవండి..
Maha Kumbh: కుంభమేళాకు వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. లేకుంటే ఇబ్బందులు తప్పవు..
Kejrival : ఢిల్లీ ఎన్నికల సమయంలో..కేజ్రీవాల్‌కు ఈడీ షాక్..
Read Latest National News and Telugu News
Updated Date - Jan 15 , 2025 | 03:54 PM