Tamil Nadu: బీజేపీ కొత్త సారథిగా నైనార్ నాగేంద్రన్.. ప్రకటించిన అన్నామలై
ABN , Publish Date - Apr 12 , 2025 | 09:47 PM
నాగేంద్రన్ ఒక్కరే పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయగా ఆయన నాయకత్వాన్ని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు పొన్ రాథాకృష్ణన్, డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్, డాక్టర్ ఎల్.మురుగున్, జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు హెచ్.రాజా, అల్ ఇండియా మహిళా మోర్చా అధ్యక్షులు వనతి శ్రీనివాసన్ బలపరిచారు.

చెన్నై: తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడుగా నైనార్ నాగేంద్రన్ (Nainar Nagendran) శనివారంనాడు ఎన్నికయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో నాగేంద్రన్ ఎన్నికైనట్టు మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తురణ్ ఛుగ్‌లు ప్రకటించారు. నాగేంద్రన్ ఒక్కరే పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయగా ఆయన నాయకత్వాన్ని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు పొన్ రాథాకృష్ణన్, డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్, డాక్టర్ ఎల్.మురుగున్, జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు హెచ్.రాజా, అల్ ఇండియా మహిళా మోర్చా అధ్యక్షులు వనతి శ్రీనివాసన్ బలపరిచారు.
Murshidabad Violence: ముర్షీదాబాద్‌లో కేంద్ర బలగాలు.. కోల్‌కతా హైకోర్టు ఆదేశం
నా జీవితంలో మరపురాని రోజు
అన్నామలై ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈరోజు తాను స్టేజిపై ఉండగలగడం తన రాజకీయ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అని అన్నారు. జనసంఘ్ నుంచి బీజేపీ ఏర్పాటు వరకూ మన పార్టీ ఎన్నో సవాళ్లు ఎదుర్కొందని, భారతదేశ సార్వభౌమాధికారం కోసం, ఆనువంశిక పాలన నుంచి విముక్తి చేయడానికి పార్టీ ఎన్నో ఒడిదుకులు ఎదుర్కొందని చెప్పారు. అయినప్పటికీ బీజేపీ సాధించిన విజయాలు గొప్పవని, 2025లో నరేంద్ర మోదీ మూడోసారి కూడా అధికారంలోకి వచ్చారని అన్నారు. ఆయన నాయకత్వంపై ప్రజలకు ఉన్న అపార విశ్వాసానికి ఇదే నిదర్శనమని అన్నారు. తమిళనాడులోని డీఎంకే విచ్ఛిన్నకర శక్తి అని, 2026 ఎన్నికల్లో డీఎంకేను ఇంటికి సాగనంపడమే మన డ్రీమ్ అని చెప్పారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా నాలుగేళ్లు పనిచేయడం తనకు దక్కిన మహదవకాశంగా భావిస్తున్నానని, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నామలై అన్నారు. హోం మంత్రి అమిత్‌షా చెప్పినట్టుగా రాబోయే రాష్ట్ర ఎన్నికలు ఎన్డీయే తరఫున ఎడప్పాడి కె.పళనిస్వామి నాయకత్వంలో పనిచేస్తామని ఆయన పునరుద్ఘాటించారు. నాగేంద్రన్ నాయకత్వంపై తమకు పరిపూర్ణ విశ్వాసం ఉందని, ఇప్పుడు రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడు ఎన్నికైనందున ఆయన చూపిన మార్గాన్ని అంతా అనుసరించాలని అన్నారు.
ఇవి కూడా చదవండి..