Share News

New FASTag Rule Alert: ఫాస్టాగ్ కొత్త రూల్స్.. ఇలా పెనాల్టీలు తప్పించుకోవచ్చు..

ABN , Publish Date - Feb 13 , 2025 | 05:40 PM

New FASTag Rule Alert: మరికొద్ది రోజుల్లో కొత్త ఫాస్టాగ్ నియమాలు అమల్లోకి రానున్నాయి. అలాంటి వేళ.. వాహనదారులు పెనాల్టీ ఎలా తప్పించుకోవాలంటే.. ఏమి చేయాలి. అలాగే ఏడాదికి ఒకే సారి.. లేదా15 ఏళ్ల పాటు ఒకేసారి ఫాస్టాగ్ చెల్లింపు చేసే విధంగా కేంద్రం అడుగులు వేస్తోంది.

New FASTag Rule Alert: ఫాస్టాగ్ కొత్త రూల్స్.. ఇలా పెనాల్టీలు తప్పించుకోవచ్చు..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: మరికొద్ది రోజుల్లో కొత్త ఫాస్టాగ్ నియమావళిని ది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అమల్లోకి తీసుకు రానుంది. ఈ ఫాస్ట్‌ట్యాగ్‌లో బ్యాలెన్స్ ధ్రువీకరణకు సంబంధించిన రెండు కీలకమైన మార్పులతో ఎన్‌పీసీఐ టోల్ నిర్వహణ కోసం మార్గదర్శకాలను తీసుకు వచ్చింది. ఇవీ పెనాల్టీలను నివారించడంతోపాటు సజావుగా వాహనాలు ముందుకు వెళ్లేందుకు ఉపయోగిపడతాయి. కొత్త ఫాస్టాగ్ నియమావళి.. 2025, ఫిబ్రవరి 17 నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యలో ఈ ఫాస్టాగ్ రూల్స్‌లో కీలక మార్పులు చేసింది.

ఫాస్టాగ్ రూల్స్‌లో కీలక మార్పులు..

ఫాస్టాగ్ లావాదేవీలు జరపకుండా వెళ్లే వాహనాలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టనున్నారు. అలాగే టోల్ బూత్ చెల్లించే దాదాపు గంట సమయం ముందు ఖాతాలో బ్యాలెన్స్ తక్కువ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఖాతాలో బ్యాలెన్స్ తక్కువ ఉన్నా.. బ్లాక్ లిస్ట్‌లో పెట్టే అవకాశముంది. ఇక రవాణా కార్యాలయంలో వాహన రిజిస్ట్రేషన్‌కు అనుగుణంగా కేవైసీ లేకున్నా బ్లాక్ లిస్ట్‌లో పెట్టనున్నారు. టోల్ ప్లాజాలో వద్ద లావాదేవిలు జరిగి.. పది నిమిషాల అనంతరం ఫాస్టాగ్ ఇన్‌యాక్టివ్ అయినా..ఇబ్బంది ఎదుర్కోవాలసి వస్తుంది. ఫాస్టాగ్ రూల్స్ సకమ్రంగా లేకుంటే.. సిస్టమ్ ఎర్రర్ కోడ్ 176 చూపిస్తోంది. దీంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాహనానికి రెట్టింపు టోల్ రుసుము వసూలు చేస్తారు.

Also Read: కొత్త ఆదాయపు పన్ను బిల్లును సభలో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్


కొత్త ఫాస్టాగ్ వల్ల దేశంలోన టోల్ బూత్‌ల వద్ద రద్దీని నివారిస్తోంది. డిజిటల్ టోల్ కలెక్షన్స్ సిస్టమ్ ద్వారా నగదు లావాదేవీలను సులభతరం చేస్తుంది. ఈ ఫాస్టాగ్ నిర్వహణకు వాహన యజమానులు ఎప్పటికప్పుడు అప్ డేట్‌గా ఉండాల్సి ఉంటుంది. దేశమంతట సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించడానికి.. అలాగే తగినంత బ్యాలెన్స్ ఉండడంతోపాటు.. కేవైసీ వివరాలను అప్ డేట్ చేయడం ద్వారా పెనాల్టీ రుసుములు నివారించ వచ్చు.

Also Read: చవితి వేడుకలకు ప్రధాని హాజరు స్పందించిన రిటైర్డ్ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్


ఫాస్టాగ్‌పై ఆధారపడే వాహనదారులు.. వారు ప్రయాణించిన ప్రతి సారీ టోల్ ద్వారా వెళ్లడానికి వారి ఫాస్టాగ్ ఖాతాను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంది. జాతీయ రహదారులపై వాహనదారులు ప్రయాణాన్ని సాఫీగా సాగించడానికి ప్రభుత్వం జీవిత కాల హైవేను ప్రారంభించాలని ఆలోచన చేస్తోంది. దీని ద్వారా వాహనదారులు 15 ఏళ్ల పాటు జాతీయ రహదారులపై ప్రయాణించడానికి రూ. 30 వేలుగా నిర్ణయించనుందని సమాచారం. అలాగే స్వల్పకాలం అంటే.. ఏడాదికి రూ. 3 వేలుగా నిర్ణయించాలని తెలుస్తోంది. వీటిని వినియోగించుకోవడం ద్వారా.. సులభతరంగా ప్రయాణం చేయవచ్చు.

For National News And Telugu News

Updated Date - Feb 13 , 2025 | 07:05 PM