Share News

Delhi Stampede: రైళ్లు రద్దు కాలేదు, ఫ్లాట్‌ఫాం మార్చలేదు... తొక్కిసలాటపై రైల్వే శాఖ వివరణ

ABN , Publish Date - Feb 16 , 2025 | 06:11 PM

ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు 14వ నెంబర్ ఫ్లాట్‌ఫాం మీదకు భారీ సంఖ్యలో ప్రయాణికులు గుమిగూడటంతో ఊహించని విధంగా తొక్కిసలాట చోటుచేసుకుందని నార్తరన్ రైల్వై చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ తెలిపారు.

Delhi Stampede: రైళ్లు రద్దు కాలేదు, ఫ్లాట్‌ఫాం మార్చలేదు... తొక్కిసలాటపై రైల్వే శాఖ వివరణ

న్యూఢిల్లీ: రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరిగి 18 మంది ప్రయాణికులు మరణించానికి దారితీసిన కారణాలపై భిన్న కథనాలు వినిపిస్తుండటంపై రైల్వే శాఖ వివరణ ఇచ్చింది. ఏ ఒక్క రైలును రద్దు (cancelled) చేయలేదని, ఫ్లాట్‌ఫాం మారుస్తున్నట్టు ఎలాంటి ప్రకటన కూడా చేయలేదని తెలిపింది. ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు 14వ నెంబర్ ఫ్లాట్‌ఫాం మీదకు భారీ సంఖ్యలో ప్రయాణికులు గుమిగూడటంతో ఊహించని విధంగా తొక్కిసలాట చోటుచేసుకుందని నార్తరన్ రైల్వై చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి (CPRO) హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ తెలిపారు.

Delhi Railway Station Stampede: తొక్కిసలాట ఘటనపై దర్యాప్తునకు రైల్వే శాఖ ద్విసభ్య కమిటీ


''షెడ్యూల్డ్ రైళ్ల ఫ్లాట్‌ఫాంలను మారుస్తూ మేము ఎలాంటి ప్రకటన చేయలేదు. రైళ్లను కూడా రద్దు చేయలేదు. నిజానికి రద్దీకి అనుగుణంగా సాయంత్రం సమయంలో 5 నుంచి 6 ప్రత్యేక రైళ్లు కూడా వేశాం'' అని ఉపాధ్యాయ్ తెలిపారు. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌కు పెద్దఎత్తున ప్రయాణికులు తరిలివస్తుండటంతో ఢిల్లీ నుంచి ప్రయాగరాజ్‌కు 350 నుంచి 400 రైళ్లు నడుపుతున్నామని చెప్పారు. అయితే ప్రమాద (తొక్కిసలాట) సమయంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఫ్లాట్‌ఫాం 14 నుంచి 12కు ఫుట్‌బ్రిడ్జి మీదుగా కదులుతుండటంతో అనూహ్యంగా తొక్కిసలాట చోటు చేసుకుందన్నారు.


కాగా, ఫ్లాట్‌ఫాం 14, 15కు దారితీసే ఫుట్ ఓవర్ బ్రిడ్జి మెట్ల మీద నుంచి ఒక ప్రయాణికుడు జారి పడటం, వెనుకనున్న వాళ్లు అతనిపై పడటంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పిందని, ఘోర విషాదం చోటుచేసుకుందని రైల్వే అధికారులు తెలిపారు. రైళ్లు బయలుదేరడంలో జరిగిన జాప్యం, ప్రతి గంటకు 1,500 టిక్కెట్ల అమ్మకాలతో రైల్వేస్టేషన్ వద్ద విపరీతమైన రద్దీ నెలకొని ప్రయాణికుల్లో గందరగోళం నెలకొన్నట్టు మరికొన్ని వర్గాలు చెబుతున్నాయి.


మరోవైపు, తొక్కిసలాట ఘటనపై అత్యున్నత స్థాయి దర్యాప్తునకు రైల్వే శాఖ ద్విస్వభ్య కమిటీని ఏర్పాటు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన కమిటీ రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లను, ఇతర డాక్యుమెంట్లను పరిశీలిస్తోంది. త్వరలోనే నివేదికను సమర్పించనుంది. దీనితో పాటు మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1 లక్ష చొప్పున పరిహారం ప్రకటించింది.


ఇవి కూడా చదవండి...

Maha Kumbh 2025: కుంభమేళాకు అర్థమే లేదు.. లాలూ వివాదాస్పద వ్యాఖ్యలు

Delhi Railway Station Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు కారణం ఇదేనా?

Maharashtra: మహారాష్ట్రలో లవ్‌ జిహాద్‌ నియంత్రణకు చట్టం!

Ranveer Allahbadia: చంపుతామంటూ బెదిరిస్తున్నారు.. ఇన్‌స్టా పోస్ట్‌లో రణ్‌వీర్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 16 , 2025 | 06:13 PM