EPS: తేల్చిచెప్పేశారు.. ఆ మాజీసీఎంను పార్టీలో చేర్చుకునేది లేదు
ABN, Publish Date - Mar 28 , 2025 | 10:23 AM
ఆ మాజీ ముఖ్యమంత్రిని తిరిగి పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి స్పష్టం చేశారు. దీనిపై ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరంలేదని ఆయన మరోమారు పేర్కొన్నారు.

- మరోమారు స్పష్టం చేసిన ఈపీఎస్
చెన్నై: పార్టీకి పలు విధాలుగా నష్టం చేకూరుస్తూ ద్రోహం చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (Former Chief Minister O. Panneerselvam)ను మళ్ళీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదని అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) మరోమారు స్పష్టం చేశారు. తూత్తుకుడిలో బుధవారం మృతిచెందిన మాజీ ఎమ్మెల్యే కరుప్పసామి పాండ్యన్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు గురువారం ఉదయం వెళ్లిన ఈపీఎస్.. విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ... ఇటీవల ఢిల్లీలో అమిత్‌షాను కలుసుకున్న సందర్భంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరానని చెప్పారు.
ఈ వార్తను కూడా చదవండి: UP: భార్యకు లవర్‌తో వివాహం.. అసలు కారణం ఇదే
మాజీ ముఖ్యమంత్రి ఓపీఎ్‌సను మళ్ళీ పార్టీలో చేర్చుకోవాలంటూ తనపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ని పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదన్నారు. పార్టీకి ద్రోహం చేసి పార్టీని శత్రువుల దగ్గర తాకట్టు పెట్టేందుకు ప్రయత్నించిన ఓపీఎ్‌సని ఎలా పార్టీలో చేర్చుకోగలమని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆన్నాడీఎంకేలో చేరుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందన్నారు. తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం జరుపుతున్న దాడులను, అక్రమ నిర్బంధాలను శాశ్వతంగా అడ్డుకునే దిశగా కేంద్రప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు.
ఈపీఎస్‌తో కాదనుకుని..
తూత్తుకుడిలో అన్నాడీఎంకే మాజీ శాసనసభ్యుడు కరుప్పస్వామి పాండ్యన్ భౌతికకాయం వద్ద నివాళులర్పించేందుకు వెళ్ళిన మాజీ ముఖ్యమంత్రులు ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్), ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్) తిరుగు ప్రయాణంలో ఒకే విమానంలో రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇద్దరూ ఒకే విమానంలో టిక్కెట్లు రిజర్వ్ చేసుకోవడంతో అన్ని వర్గాలు వారి ప్రయాణంపై ఉత్కంఠతో ఎదురు చూశాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న ఓపీఎస్ తూత్తుకుడి నుంచి మదురై వరకు రోడ్డుమార్గంలో వచ్చి, అక్కడి నుంచి చెన్నైకి విమానంలో వచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఎమ్మెల్యే సత్యంను బెదిరించిన వ్యక్తికి బెయిల్
పాస్టర్ ప్రవీణ్‌కు అంతిమ వీడ్కోలు
మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదు
గుమ్మడిదలను మరో లగచర్ల చేయొద్దు..
Read Latest Telangana News and National News
Updated Date - Mar 28 , 2025 | 10:23 AM