Prahlad Patel: ప్రజలకు 'అడుక్కోవడం' అలవాటయింది.. కేంద్ర మాజీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

ABN, Publish Date - Mar 02 , 2025 | 08:02 PM

అవంతి బాయ్ విగ్రహావిష్కరణ అనంతరం ప్రహ్లాద్ పటేల్ మాట్లాడుతూ, దేశం కోసం ఎందరో ప్రాణాలు అర్పించారని, వారి త్యాగాలను అర్థం చేసుకుని, వారు చూపించిన విలువలను పాటించనప్పుడే ప్రతి ఒక్కరూ విజయాలు సాధిస్తారని అన్నారు.

Prahlad Patel: ప్రజలకు 'అడుక్కోవడం' అలవాటయింది.. కేంద్ర మాజీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

రాయ్‌గఢ్: ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు ఉచితంగా తాయిలాలు ఎరచూపుతుండంపై ఓవైపు చర్చ జరుగుతుండగా, ప్రజల్లో అడుక్కునే (Begging) అలవాటు పెరుగుతోందని కేంద్ర మాజీ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ (Prahlad Singh Patel) సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ పంచాయతీ, గ్రామాణభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న ప్రహ్లాద్ సింగ్ ఆదివారంనాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నుంచి ప్రతీదీ అడుక్కోవడానికి ప్రజలు అలవాటుపడుతున్నారని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధునుల నుంచి వీరు పాఠాలు నేర్చుకోవాలని అన్నారు.

Madhabi Buch: మాధవి బచ్‌పై ఎఫ్ఐఆర్... ముంబై కోర్టు ఆదేశం


రత్నగిరి జిల్లా సుథలియా టౌన్‌లో రాణి అవంతి బాయ్ లోథి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. రామ్‌గఢ్ (ప్రస్తుంతం దిండోరి) క్వీన్‌గా ఉన్న అవంతీ బాయ్ స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ పాలకులపై పోరాడి 1958 మార్చి 20న తన ప్రాణాలను కోల్పోయారు.


తీసుకోవడమే అలవాటైంది..

అవంతి బాయ్ విగ్రహావిష్కరణ అనంతరం ప్రహ్లాద్ పటేల్ మాట్లాడుతూ, దేశం కోసం ఎందరో ప్రాణాలు అర్పించారని, వారి త్యాగాలను అర్థం చేసుకుని, వారు చూపించిన విలువలను పాటించనప్పుడే ప్రతి ఒక్కరూ విజయాలు సాధిస్తారని అన్నారు. అప్పుడే సమాజానికి మనం తిరిగి ఏదైనా ఇవ్వగలుగుతామని చెప్పారు. అయితే ప్రజలు సమాజం నుంచి తీసుకోవడమే అలవాటు చేసుకున్నారని, ఇప్పుడు ప్రభుత్వం నుంచి బెగ్గింగ్ చేయడానికి అలవాటు పడుతున్నారని అన్నారు. ఎన్నికల్లో ఉచితాలు పంపిణీ చేస్తున్నప్పుడు ప్రజలు తమ డిమాండ్లను ఏకరవుపెడుతూ లేఖలు ఇస్తున్నారని చెప్పారు. రాజకీయనేతలను దండలు వేసి, డిమాండ్ లెటర్లు ఇచ్చే పద్ధతి మంచిది కాదన్నారు. బెగ్గర్ల ఆర్మీ వల్ల సమాజానికి ఒరిగేదేమీ ఉండదని, పైగా సమాజం బలహీనపడుతుందని అన్నారు. ఉచితాలు తీసుకోవడానికి అలవాటు పడటం మన వీరజవాన్లను గౌరవించకపోవడమే అవుతుందని చెప్పారు.


కాంగ్రెస్ ఘాటు విమర్శ

ప్రజలను బిచ్చగాళ్లంటూ మంత్రి ప్రహ్లాద్ సింగ్ మాట్లాడటాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఆయన స్పీచ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. బీజేపీకి ఓట్ల కోసం వచ్చినప్పుడు ప్రజలు దేవుళ్లుగా, ఓట్లు వేయించుకున్న తరువాత బికారుల్లా కనిపిస్తారని విమర్శించింది.


ఇవి కూడా చదవండి

Mayawati: నేనున్నంత వరకూ నాకు వారసులు ఉండరు: మాయావతి బిగ్ స్టేట్‌మెంట్

PM Modi: 100 జిల్లాల్లో పీఎం ధన ధాన్య కృషి

Privilege Motion: జైశంకర్‌పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 02 , 2025 | 08:04 PM