ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

EPFO: గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ విత్‌డ్రా మరింత సులువు.. ఎలాగంటే..

ABN, Publish Date - Apr 03 , 2025 | 07:56 PM

EPFO: ఈపీఎఫ్‌ విత్ డ్రాను కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మరింత సులభతరం చేసింది. ఇకపై నగదు ఆన్ లైన్‌లో విత్ డ్రా చేసుకోవాలంటే.. క్యాన్సిల్ చేసిన చెక్కును అప్ లోడ్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ తరహా మార్పు కారణంగా దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మందికిపైగా లబ్ది చేకూరుతోందని పేర్కొంది.

EPFO

న్యూఢిల్లీ, ఏప్రిల్ 03: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఆన్‌లైన్‌‌లో నగదు ఉపసంహరణను మరింత సులభతరం చేసింది. ఇకపై ఆన్‌లైన్‌లో నగదు విత్‌డ్రా చేసుకోవాలంటే.. క్యాన్సిల్ చేసిన చెక్కు అప్‌లోడ్ చేసే అవసరం లేదని స్పష్టం చేసింది. అలాగే బ్యాంక్ అకౌంట్‌ను యజమానులు ధృవీకరించాల్సిన అవసరం కూడా లేదంది. ఈ ఫాస్ట్ ట్రాక్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియ వల్ల దేశంలో ఎనిమిది కోట్ల మందికి ప్రయోజనం కలుగుతోందని తెలిపింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

ప్రస్తుతం ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో నగదు తీసుకోవాలంటే.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలంటే యూఏఎన్ లేదా పీఎఫ్ నంబర్‌తో లింక్ అయిన బ్యాంక్ పాస్ బుక్‌కు సంబంధించిన చెక్కు ఫొటోను ఆప్‌లోడ్ చేయాల్సి ఉంది.అనంతరం దరఖాస్తుదారుడు బ్యాంక్ ఖాతా వివరాలను యజమాన్యం ధృవీకరించాల్సి ఉంది. ఈ తతంగం మొత్తం పూర్తయితేనే కానీ.. ఆ తర్వాత దరఖాస్తుదారుడుకి నగదు చేతికి అందదు. ఈ అవసరాన్ని ఈపీఎఫ్‌వో తొలగించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియ వేగవంతం చేయడంతోపాటు క్లెయిమ్ తిరస్కరణలను తగ్గించేందుకు ఇది సహాయ పడుతోందని కార్మిక మంత్రిత్వ శాఖ స్ఫష్టం చేసింది. కేవైసీ అప్ డేట్ చేసిన వారికి ఈ నిబంధనను పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇది వరకే తొలగించిన సంగతి తెలిసిందే.


2024, మే 28న పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఈ మార్పుల వల్ల ఇప్పటికే 1.7 కోట్ల మంది EPF సభ్యులకు ప్రయోజనం చేకూరిందని కార్మిక శాఖ తెలిపింది. ఇది విజయవంతం కావడంతో.. దీనిని సభ్యులందరికి ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొంది. అలాగే యూఏఎన్‌తో బ్యాంకు ఖాతాలను అనుసంధానించే సమయంలో EPF సభ్యుల వివరాలతో పాటు బ్యాంకు ఖాతా ఇప్పటికే ధృవీకరించబడిందని.. ఈ అదనపు డాక్యుమెంటేషన్ ఇకపై అవసరం లేదని వివరించింది. ఈ విధానం ద్వారా వెంటనే 14.95 లక్షలకుపైగా ఈపీఎఫ్ సభ్యులకు ప్రయోజనం చేకూరనుందని స్పష్టం చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

No Visa: వీసా లేకుండా.. ఇండియన్ పాస్ పోర్ట్‌తో 62 దేశాలు చుట్టేయచ్చు

Trump's Reciprocal Tariffs: కొత్త అవకాశాలను అధ్యయనం చేస్తున్నాం: భారత్

Gold Rates: బిగ్ షాక్.. రూ.లక్షకు చేరనున్న బంగారం

Updated Date - Apr 03 , 2025 | 08:06 PM