ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Budget 2025: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల ఖాతాల్లోకి రూ.10 వేలు

ABN, Publish Date - Jan 13 , 2025 | 05:40 PM

వచ్చే నెలలో రైతులకు గుడ్ న్యూస్ రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రైతులకు ప్రతి ఏటా రూ. 6 వేలు అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని వచ్చే బడ్జెట్లో రూ. 10 వేలకు పెంచనున్నట్లు తెలిసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

pm Kisan Samman Nidhi

వచ్చే ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పూర్తి బడ్జెట్లో (Budget 2025) రైతులకు గుడ్ న్యూస్ రాబోతుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Samman Nidhi) కింద వార్షికంగా వచ్చే మొత్తం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. పలు వర్గాల సమాచారం ప్రకారం రైతులకు చెల్లించే వార్షిక మొత్తం రూ.6,000 నుంచి రూ.10,000 వరకు పెరుగుతుందని చెబుతున్నారు. దీంతో ఈ పథకంలో నమోదు చేసుకున్న రైతులందరూ దీని ప్రయోజనాన్ని పొందనున్నారు. బడ్జెట్ మొదటి రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.


ఫిబ్రవరి మొదటి వారంలో..

అయితే దీని గురించి అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. కానీ పెంచే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ఒక్కొక్కటి రూ. 2,000 చొప్పున మూడు వాయిదాలలో రూ. 6,000 అందిస్తుంది. ప్రతి వాయిదా చెల్లింపుల మధ్య నాలుగు నెలల అంతరం ఉంటుంది. తదుపరి విడత డబ్బును ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో బడ్జెట్లో ఈ మొత్తం పెంచిన తర్వాత, పెరిగిన మొత్తం చెల్లిస్తారా లేదా పాత వాయిదా వస్తుందా అని రైతులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.


వీరికి ఎంతో ఉపయోగం..

తాజా సమాచారం ప్రకారం రైతుల e-KYC (ఎలక్ట్రానిక్ కేవైసి) పూర్తి చేసుకున్న వారికే పథకంలో ప్రయోజనం లభిస్తుంది. e-KYC పూర్తి చేయని రైతులు ఈ పథకం ప్రయోజనాలు పొందలేరు. అయితే గతంలో రైతులు ఏడాదికి రూ. 6 వేలను మూడు వాయిదాలను పొందుతారు. ఇప్పుడు పెంచనున్న రూ.10 వేల మొత్తాన్ని మూడు వాయిదాలలో ఎలా చెల్లిస్తారని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ పథకం కింద అందించే మొత్తం రూ.10,000 అందిస్తే రైతులకు వ్యవసాయ పనులు, కూలీలకు, కరెంట్ సహా ఇతర ఖర్చులకు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా చిన్న రైతులకు ఈ మొత్తం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ నిధులు రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు.


పీఎం కిసాన్ నిధి పథకం

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018 డిసెంబర్ 1న ప్రారంభించింది. ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా ఉంది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా రైతులకు సహాయం అందించడమే ఈ పథకపు ప్రధాన ఉద్దేశం. 18వ విడత విడుదలతో దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతులు PM-KISAN పథకం కింద రూ. 3.45 లక్షల కోట్లు అందుకున్నారు. ఈ ఏడాది 19వ విడత నిధులు విడుదల చేయనున్నారు. మరింత సమాచారం కోసం అధికారికి వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ను సందర్శించండి.


ఇవి కూడా చదవండి:

Maha Kumbh Mela 2025: కుంభమేళా చేరుకున్న బాహుబలి బాబా.. 800 కిలోమీటర్లకుపైగా సైకిల్ ప్రయాణం


Stones Thrown: మహాకుంభమేళాకు వెళ్లే యాత్రికుల ట్రైన్‌పై రాళ్ల దాడి

Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..


Tata Tiago: రూ. 7 లక్షలకే.. టాటా ఎలక్ట్రిక్ కార్...


Investment Tips: ఒకేసారి ఈ పెట్టుబడి చేసి మర్చిపోండి.. 15 ఏళ్లకే మీకు కోటీ

Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 13 , 2025 | 05:41 PM