PM Modi: యూనస్‌తో మోదీ భేటే.. బంగ్లాలో హిందువుల భద్రతపై ప్రస్తావన

ABN, Publish Date - Apr 04 , 2025 | 03:23 PM

సుస్థిర, ప్రగతిశీల, ప్రశాంత, ప్రజాస్వామ్య బంగ్లాదేశ్‌కు తమ మద్దతు ఉంటుందని, ప్రజలే కేంద్రంగా ఉంటే సంబంధాలకు భారత్ ప్రాధాన్యమిస్తుందని యూనస్‌తో జరిగిన భేటీలో మోదీ పునరుద్ఘాటించినట్టు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రి తెలిపారు.

PM Modi: యూనస్‌తో మోదీ భేటే.. బంగ్లాలో హిందువుల భద్రతపై ప్రస్తావన

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ చీఫ్ అడ్వయిజర్ మహమ్మద్ యూనస్‌ (Muhammad Yunus) తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) భేటీ అయ్యారు. షేక్ హసీనా పదవీచుత్యురాలై ఇండియాలో ఆశ్రయం పొందినప్పటి నుంచి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారుతో ప్రధాని మోదీ భేటీ కావడం ఇదే మొదటిసారి. బ్యాంకాక్‌లో బిమ్‌స్టెక్ సదస్సు సందర్భంగా వీరురువురూ సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో బీజింగ్‌కు బంగ్లా చేరువవుతుండటం, బంగాల్లో మైనారిటీలు ముఖ్యంగా హిందువులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఉభయుల భేటీ ప్రాధాన్యతనను సంతరించుకుంది.

Waqf Bill 2025: వక్ఫ్ బిల్లుకు ఆమోదం.. మోదీ-షా స్కెచ్ వేస్తే ఇట్లుంటది


సుస్థిర, ప్రగతిశీల, ప్రశాంత, ప్రజాస్వామ్య బంగ్లాదేశ్‌కు తమ మద్దతు ఉంటుందని, ప్రజలే కేంద్రంగా ఉంటే సంబంధాలకు భారత్ ప్రాధాన్యమిస్తుందని ఈ భేటీలో మోదీ పునరుద్ఘాటించినట్టు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రి తెలిపారు. ''బంగ్లాదేశ్‌తో సానుకూల, నిర్మాణాత్మక సంబంధాలను భారత్ కోరుకుంటోందని ప్రధాని తెలియజేశారు. సరిహద్దుల్లో అక్రమ వలసలను నియంత్రించాలిని కోరారు. సరిహద్దు భద్రత, సుస్థిరత కాపాండేంజుకు చొరబాట్లను అడ్డుకోవాలని కోరారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడులపై ఆందోళనను కూడా యూనస్‌ దృష్టి తీసుకువెళ్లారు" అని మిస్రి తెలిపారు.


ఇటీవల కాలంలో భారత్‌లోని ఈశాన్య రాష్ట్రలపై యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, చైనాకు దగ్గరవుతున్నట్టు సంకేతాలు ఇవ్వడం వంటివి చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో భారత ప్రధానితో సమావేశానికి ఎదురుచూస్తున్నట్టు బంగ్లా విదేశాంగ శాఖ ఇటీవల పేర్కొంది. 2024 ఏప్రిల్‌లో యూనస్ బంగ్లా పగ్గాలు చేపట్టారు. 2024 ఆగస్టు 5 నుంచి 2025 మార్చి 23 వరకూ 2,400కు పైగా మైనారిటీలకు సంబంధించిన ఘటనలు బంగ్లాలో చోటుచేసున్నాయి. హత్యలు, దహనకాండలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని, బాధితులకు న్యాయం చేయాలని బంగ్లాదేశ్‌కు పలుమార్లు విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనలపై విచారణకు ఆదేశించాలని కోరింది.


ఇవి కూడా చదవండి..

ప్లీజ్‌.. అన్నామలైని మార్చొద్దు

PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..

For National News And Telugu News

Updated Date - Apr 04 , 2025 | 03:31 PM