Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Feb 04 , 2025 | 10:38 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహాకుంభమేళాను రేపు (ఫిబ్రవరి 5న) సందర్శించనున్నారు. ఈ క్రమంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. అయితే ప్రధాని మోదీ ఈరోజున ఎందుకు సందర్శిస్తున్నారనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (narendra modi) ఫిబ్రవరి 5న ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాను (Maha Kumbh Mela 2025) సందర్శించనున్నారు. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం మోదీ ఉదయం 10:30 గంటలకు ఫిబ్రవరి 5న ప్రయాగరాజ్‌కు చేరుకుంటారు. ఆ క్రమంలో ప్రధాని మహాకుంభమేళాను సందర్శించే సమయంలో ప్రత్యేక పూజలతోపాటు పవిత్ర స్నానం చేయనున్నారని తెలుస్తోంది. ఆయన ప్రయాగరాజ్‌లోని అరయిల్ ఘాట్‌కు చేరుకుని, అక్కడి నుంచి గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ స్థలమైన సంగం వద్ద పడవ ప్రయాణం చేస్తారు. ఆ క్రమంలో అక్కడి పవిత్ర సంగమ నదుల్లో ఆయన పవిత్ర స్నానం చేయనున్నారు.
స్నానం తర్వాత మోదీ..
మోదీ ఆ తర్వాత, భక్తులతో సంభాషించడం, ఆయా ప్రాంతాలలో పర్యవేక్షణ నిర్వహించడం, 2025 మహాకుంభ్ కోసం నిర్వహించిన ఏర్పాట్లను పరిశీలించడం వంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. మేళా అధికారులు వివరించినట్లుగా, ముందుగా నిర్ణయించబడిన షెడ్యూల్ ప్రకారం ముఖ్యంగా స్టేట్ పెవిలియన్, నేత్ర కుంభ్ సందర్శనలో మార్పులు చేశామని అధికారులు ప్రకటించారు. దీంతో ఆయనకు కుంభమేళా ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇవ్వనుంది.
ఫిబ్రవరి 5న ఏంటి స్పెషల్..
ఫిబ్రవరి 5 ఒక ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఇది మాఘ అష్టమి, భీష్మ అష్టమి వచ్చిన రోజు. ఈరోజుకు హిందూ సంప్రదాయంలో ఆధ్యాత్మిక విశేషత కలిగి ఉంది. మాఘ అష్టమి హిందూ మాఘ మాసం ఎనిమిదో రోజున జరుపుకునే పవిత్రమైన రోజు. ఈ రోజున భక్తులు త్రివేణి సంగమ స్థలంలో (ప్రయాగరాజ్) పవిత్ర స్నానాలు చేస్తారు. ఆ క్రమంలో ఆధ్యాత్మిక సాధనలు, పూజలు, ధ్యానాలు, దాన ధర్మాలు నిర్వహించబడతాయి. ఇది గుప్త నవరాత్రి సమయంలో కూడా వస్తుంది.
ఆధ్యాత్మిక సంప్రదాయాలలో
దీనిని హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయాలలో అత్యంత పవిత్రమైన కాలంగా పరిగణిస్తారు. ఇది మహాభారతం నుంచి గౌరవనీయ యోధుడు భీష్మ పితామహుని సంస్మరించుకునే రోజు. పురాణాల ప్రకారం, భీష్ముడు తన బాణాల మంచంలో పడుకున్న సమయంలో, సూర్యుడు ఉత్తరాయణం ప్రారంభం, శుక్ల పక్షం మొదలయిన తర్వాతే, తన మరణ సమయాన్ని ఎంచుకున్నాడు. ఆ క్రమంలో ఆయన ఆత్మత్యాగం, ధర్మం భారతీయ సంస్కృతిలో మరింత ప్రాముఖ్యాన్ని పొందాయి.
12 ఏళ్లకు ఒకసారి..
దీంతో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మహాకుంభమేళా గొప్ప మతపరమైన ఉత్సవంగా నిలుస్తోంది. ఇది ఆధ్యాత్మిక దృష్టిలో అత్యంత పవిత్రమైన వేడుకగా భక్తులు భావిస్తున్నారు. దీంతో భారతీయుల కోసం ఇది ఒక సమ్మిళిత వేదికగా నిలిచిపోతుంది. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు, యాత్రికులు తమ మతపరమైన విధానాలను కొనసాగించడానికి ఆయా ప్రాంతాలకు వచ్చి సంగమ స్థలంలో పవిత్ర స్నానం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News